
Chandra Mohan Wife : 50 సంవత్సరాల సినీ జీవితంలో హీరో దగ్గర నుంచి తండ్రి, తాత పాత్ర వరకు వైవిధ్యమైన ఎన్నో సినిమాలలో నటించిన నటుడు చంద్రమోహన్. సినిమాల్లో చంద్రమోహన్ గురించి తెలిసినంతగా అతని పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. చంద్రమోహన్ భార్య జలంధర ఒక గొప్ప రచయిత్రి. పెళ్లి తర్వాత కూడా చంద్రమోహన్ ఆమె ను కెరియర్ లో బాగా ప్రోత్సహించారు.
చంద్రమోహన్ జలంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. మధుర మీనాక్షి, మాధవి. మొదటి కూతురు సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడగా రెండవ కూతురు చెన్నైలో డాక్టర్ గా చేస్తున్నారు. కళా తపస్వి విశ్వనాథ్ చంద్రమోహన్ కి బంధువు అవుతారు. చంద్రమోహన్ సినిమాల్లోకి రావడానికి, అతని ఎదుగుదలకు విశ్వనాథ్ ఎంతో సహాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రమోహన్ పలు సందర్భాలలో చెప్పారు.
తన సహజమైన నటనతో చంద్రమోహన్ ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. ఎటువంటి ఎమోషన్ అయినా సరే అవలీలగా.. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా చేయగలిగే యాక్టర్ చంద్రమోహన్. ఆయన భార్య జలంధర ఎకనామిక్స్ లో బిఎ డిగ్రీ పూర్తి చేశారు. 100 కంటే పైగా చిన్న కథలను అనేక నవలలను ఆమె రచించారు. పలు సాహిత్య పురస్కారాలు కూడా అందుకున్నారు.
చంద్రమోహన్ నటన ఎందరో ప్రశంసలు అందుకుంది. రంగులరాట్నం చిత్రంలో చంద్రమోహన్ ప్రదర్శన చూసి ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు లాంటి లెజెండరీ యాక్టర్స్.. కుర్రాడు సూపర్.. ఒక్క అడుగు ఎత్తు ఉంటే ఇండస్ట్రీని ఏలేవాడే అని ప్రశంసించారు. ఒక్కసారి చంద్రమోహన్ యాక్షన్ లోకి దిగితే స్క్రీన్ పైన కనిపించేది చంద్రమోహన్ కాదు దర్శకుడు ఊహలో ప్రాణప్రతిష్ట చేసుకున్న పాత్ర మాత్రమే. ఎందుకంటే తెరమీద చంద్రమోహన్ కనిపించరు కేవలం పాత్ర మాత్రమే కనపడుతుంది. అదే అతనిలో గొప్పతనం అని ఎందరో అతన్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి.