
Al Shifa Hospital | గాజాలోని ఆస్పత్రులు, పాఠశాలలు, శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు చేస్తున్నందుకు ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఇజ్రాయెల్ ముందుగా ఆ దాడులు తాము చేయలేదని.. హమాస్ చేసిందని బుకాయించింది. ఆ తరువాత ఆస్పత్రులపై పడిన రాకెట్లు, బాంబులు అమెరికా, ఇజ్రాయెల్‌కు సంబంధించినవి అని తేలిపోవడంతో ఇజ్రాయెల్ మాట మార్చింది.
గాజాలోని అతిపెద్ద అల్ షిఫా ఆస్పత్రి కింద హమాస్ ఉగ్రవాదులు ఒక పెద్ద బేస్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారని.. అందుకే హాస్పిటల్‌పై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ దాడుల వల్ల ఆస్పత్రిలో ఉన్న రోగులు, డాక్టర్లు చనిపోతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రికి కరెంటు కోత, నీటి సరఫరా నిలిపివేత చేయడం వల్ల అందులోని నవజాత శిశువుల సైతం చనిపోయారు.

ఇప్పుడా ఆస్పత్రి కింద నిజంగానే హమాస్ కేంద్రం ఉందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో 16 ఏళ్లకు పైగా అల్ షిఫా ఆస్పత్రిలో సేవలందిస్తున్న నార్వే దేశ డాక్టర్ మాడ్స్ గిల్బర్ట్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. “ఆస్పత్రిని హమాస్ ఆక్రమించుకుందని ఇజ్రాయెల్ అబద్ధం చెబుతోంది. నిజంగానే ఆస్పత్రి కింద సొరంగాలు, హమాస్ కేంద్రం ఉంటే మాకు చూపించాలి. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకునేందుకే అమాయక పాలస్తీనా వాసులని చంపుతోంది. ఆస్పత్రులపై దాడి చేస్తే త్వరగా ప్రజలు ఆ ప్రాంతం నుంచి వదిలి వెళ్లిపోతారని ఇలా చేస్తోంది,” అని అన్నారు.

అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ ముందు నుంచి అబద్ధాల ఎజెండాతో యుద్ధాలు మొదలుపెడతారు. ఉదాహరణకు లిబ్యా దేశ అధ్యక్షుడు గదాఫీ గతంలో తన సైనికులకు వయాగ్రా టాబ్లెట్లు ఇస్తున్నాడని.. వాటిని ఉపయోగించి ఇజ్రాయెల్ మహిళలపై అత్యాచారం చేయమని ఆదేశించాడని నాటో దేశాలు(అమెరికా, ఇజ్రాయెల్, ఇంగ్లాండ్ ముఖ్యంగా) చెప్పాయి. దీంతో నాటో మిలిటరీ దళాలు లిబ్యా దేశాన్ని నాశనం చేసి గదాఫీని చాలా క్రూరంగా హత్య చేశాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలే లిబ్యాలో సైనికులకు ఎలాంటి వయాగ్రా మందు ఇచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది.
అలాగే మరో ఉదాహరణ ఇరాక్. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అమెరికా దేశంపై మండిపడేవాడు. అమెరికాకు తక్కువ ధరకు ఇంధనం ఇచ్చేది లేదని చెప్పేవాడు. కొనేళ్ల తరువాత ఇరాక్ దేశంలో అంతర్జాతీయ అనుమతి లేకుండా అణు బాంబులు, భారీ మారణాయుధాలున్నాయని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. వెంటనే నాటో దళాలు ఇరాక్‌పై దాడి చేసి అల్లకల్లోలం సృష్టించాయి. సద్దాం హుస్సేన్‌ని అరెస్టు చేసి అమెరికా అధికారులు కోర్టు ద్వారా ఉరి తీశారు.
ఆ తరువాత చాలా ఈజీగా ఎటువంటి అణు బాంబులు, మారణాయుధాలు లభించలేదని అమెరికా తెలిపింది. దీని బట్టి ఇజ్రాయెల్ కేవలం గాజాను ఆక్రమించుకునేందుకే అమాయక పౌరులను చంపుతోంది. ఆస్పత్రులపైన కనికరం లేకుండా బాంబులు వేస్తోంది. దానికి ముఖ్య కారణం గాజా సమీపంలో వందల బిలియన్ల డాలర్లు విలువ చేసే చమురు నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు.