
Kerala : కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఈ గుడి ఎంత ఫేమసో.. ఆ గుడిలో సరస్సు కూడా అంతే ఫేమస్. ఇప్పుడీ కొలనులో మరో మొసలి ప్రత్యక్షమైంది. ఇప్పుడిది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఈ కొలనులో బబియా అనే మొసలి ఉండేది. ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ మొసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించింది. ఇప్పుడీ బబియా స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైంది.
ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది? అనేది మిస్టరీగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కొలనులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. అలా కనిపించిన వాటిలో బబియా అనే మొసలి మూడోవది. తాజాగా కనిపించింది నాలుగవది.
ఒకప్పుడూ ఈ కొలనులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని బ్రిటిష్ వాళ్లు కాల్చేయగా దాని స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని.. మళ్లీ ఆ స్థానంలో మరో మొసలి రావడం అందరిని ఇప్పుడు షాక్‌కు గురి చేసింది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం ఒక విచిత్రమైతే.. ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.