Bhagini Hastha Bhojanam : తోబుట్టువు ఆప్యాయతా… ఓ పండగే..!

Bhagini Hastha Bhojanam : తోబుట్టువు ఆప్యాయతా… ఓ పండగే..!

Bhagini Hastha Bhojanam
Share this post with your friends

Bhagini Hastha Bhojanam

Bhagini Hastha Bhojanam : ఇప్పటివరకు మనము సోదరి-సోదరుడు మధ్య అనుబంధం అంటే రాఖీ పండగ ఒక్కటే ఉందని అనుకున్నాం. కానీ, ‘భగినీ హస్త భోజనం’ అనే మరో పండుగ ఉందని మనలో చాలామందికి తెలీదు. ఈ పండుగ దీపావళి వెళ్లిన రెండవరోజు, కార్తీక శుద్ధ విదియనాడు వస్తుంది. ఈ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

అక్క లేదా చెల్లిని భగిని అంటారు. ‘హస్తభోజనం’ అంటే… ఆమె చేతితో వండిన వంట. అంటే.. సోదరి వండినదాన్ని సోదరుడు తినడం. ఇందులో కొత్త విషయం లేదనిపిస్తుంది గానీ ఉంది. పూర్వం వివాహమైన చెల్లి, అక్క ఇంట సోదరులు, ఆమె తల్లిదండ్రులు భోజనం చేయటం ఉండేది కాదు. అలాచేస్తే.. ఆడపిల్ల సొమ్ముతిన్నట్టే అనే భావన ఉండేది. కానీ.. కార్తీక శుద్ధ విదియనాడు మాత్రం వివాహిత అయిన సోదరి చేతి వంట తినితీరాలని మన శాస్త్రం నిర్ణయించింది. దీని వెనక ఓ పురాణ గాథ ఉంది.

సూర్యనికి, సంధ్యాదేవి సంతానమే యముడు, యమున. యుమున అంటే.. ఆమె అన్నకు ప్రాణం. ఆమెను ముద్దుగా.. ‘యమీ’ అని పిలిచేవాడు. వివాహానంతరం యమున అత్తారింటికి పోయిన తర్వాత ఆమెకు తన అన్నను చూడాలని అనిపించింది. ఒకరోజు తన ఇంటికి భోజనానికి రమ్మని కబురు చేసి, అతనికి ఇష్టమైనవన్నీ తయారుచేసి ఎంత ఎదురుచూసినా.. యముడు భోజనానికి రాలేదు. చివరికి.. తాను కర్తవ్య పాలన కారణంగా రాలేకపోయాననీ, ‘కార్తీక శుధ్ద విదియ’ నాడు తప్పక వస్తానని కబురు పంపి.. అన్నట్లే ఆ రోజు చెల్లి ఇంటికి వెళతాడు.

నాడు.. ఆమె అన్నకు తిలకం దిద్ది, అతిథి మర్యాదలు చేసి తాను వండినవన్నీ కొసరికొసరి తినిపించగా.. యముడు సంతోషంతో ‘నీకేం కావాలో కోరుకో’ అని చెల్లిని కోరగా ‘ ఏటా నువ్వు ఈ రోజు నా ఇంటికి ఇలాగే భోజనానికి రావాలి. అలాగే భూలోకంలోని సోదరులంతా నీలాగే వారి తోబుట్టువులను చూసి వారింట భోజనం చేయాలి’ అని కోరింది. నాటి నుంచే ఈ భగినీ హస్త భోజనం ఒక పండుగలా జరుగుతూ వస్తోంది.

అలాగే.. యముడు మరునాడు యమునను తన ఇంటికి పిలిచి.. అంతకంటే గొప్ప ఆతిథ్యం ఇచ్చి సంతోషంగా తిరిగి పంపుతాడు. దీనినే ‘సోదరీ తృతీయ’ అని పేరుతో జరుపుకుంటారు. అయితే.. ఇలా మరునాడు చెల్లిని ఇంటికి పిలవటం మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే ఉంది.

భగినీ హస్త భోజనం పండుగను మరాఠీ వారు ‘భయ్యా-దుజ్’ అనీ, నేపాలీలు ‘భాయి-టికా’ అనీ, పంజాబ్ వాసులు దీనిని ‘టిక్కా’ అని పిలుస్తారు. ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని, యమునను స్మరించిన మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Co-Operative meals : సహపంక్తి భోజనాలు చేస్తే ఒకేసారి లేవాలా..

Bigtv Digital

Telangana Elections 2023: గజ్వేల్‌లో కేసీఆర్‌ ఎన్నికల హామీ.. కామారెడ్డిలో అసంతృప్తి..

Bigtv Digital

PAK VS SA MATCH : పాకిస్తాన్ కు అంపైర్ శాపం? ఆ నిర్ణయంతో గెలుపు దూరం..

Bigtv Digital

Badrinath : బద్రీనాథ్ లో పితృకార్యాలు నిర్వహిస్తే కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి

Bigtv Digital

Sharmila: అగ్గిపెట్టె మర్చిపోయి మంత్రి.. హరీష్ రావుపై షర్మిల సెటైర్లు..

BigTv Desk

Palestine | పాలస్తీనా అధ్యక్షుడిపై హత్యాయత్నం.. సెక్యూరిటీ గార్డు మృతి..

Bigtv Digital

Leave a Comment