Telangana Elections 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..ఎల్బీనగర్ నుంచి మధుయాష్కి పోటీ

Telangana Elections 2023 : కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా .. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కి

Telangana Elections 2023
Share this post with your friends

Telangana Congress MLA Candidate 2nd List

Telangana Congress MLA Candidate 2nd List(TS politics) :

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. 45 మందితో కూడిన రెండో జాబితాను శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. 55 మందితో ఇటీవల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 100 సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇంకా 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వామపక్షాలకు ఇచ్చే సీట్లపై ఎలాంటి నిర్ణయం చేయలేదు.

అధిష్టానం, గద్దర్ కుమార్తె డా.జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించింది. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీగౌడ్ పోటీ చేయనుండగా, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేయనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికు అధిష్టానం మునుగోడు సీటు కేటాయించింది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. ఇక ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలైన పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ నుంచి డా.మురళీ నాయక్, దేవరకొండ నుండి నేనావత్ బాలు నాయక్ బరిలో నిల్చోనున్నారు. ఇటీవల పార్టీలో చేరిన రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్‌ను అధిష్ఠానం కేటాయించింది. ఇక బోథ్ నుంచి వెన్నెల అశోక్, ఖానాపూర్ నుంచి వెద్మ బొజ్జు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలైన చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, వర్ధన్నపేట నుంచి కే.ఆర్ నాగరాజుకు రెండో జాబితాలో చోటు కల్పించారు. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలో నిలువనున్నారు. పాలకుర్తి సీటును డా.మేమిడిలా యశశ్వినీకు అధిష్ఠానం కేటాయించింది. జనగామ నుంచి కొమ్మూరి ప్రతాపరెడ్డి బరిలో నిల్చోనుండగా, ఇటీవల హస్తం గూటికి చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేయనున్నారు. వనపర్తి నుంచి డా.జి.చిన్నారెడ్డి, మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి, దేవరకద్ర నుంచి గావినోళ్ల మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల నుంచి అనిరుధ్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ నుండి హస్తం గూటికి చేరిన యెన్నం శ్రీనివాస్ రెడ్డికు మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించింది. నారాయణపేట్ నుండి డా.పర్ణిక చిట్టెం రెడ్డి బరిలో నిల్చోనున్నారు.

అంబర్‌పేట్ నుంచి రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ ప్రజాక్షేత్ర రణరంగంలో తాడోపేడో తేల్చుకోనున్నారు. ఇక తాండూర్ నుంచి బయ్యని మనోహర్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి వి.జగదీశ్వర్ గౌడ్, రాజేంద్రనగర్ నుంచి కస్తూరి నరేందర్, మహేశ్వరం నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ నుంచి ఆవుల రాజిరెడ్డి బరిలో నిల్చోనున్నారు. ఇక సిద్దిపేట నుంచి పూజల హరికృష్ణ బరిలోకి దిగనున్నారు. ఇక హుజురాబాద్ నుంచి వొడితెల ప్రణవ్, కోరుట్ల నుంచి జవ్వాది నర్సింగరావు, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావ్, ముథోల్ నుంచి భోస్లే నారాయణరావు పాటిల్, సిర్పూర్ నుండి రావి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Ponnala Lakshmaiah : పొన్నాల ఇంటికి కేటీఆర్.. కేసీఆర్ తో భేటీ తర్వాతే క్లారిటీ వస్తుందా?

Bigtv Digital

YS Jagan Mohan Reddy : ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్..

BigTv Desk

Godavari Flood News: లంక గ్రామాలకు ముంపు ముప్పు.. గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

Bigtv Digital

Medigadda : మేడిగడ్డ కుంగుబాటుపై ఇంకా అందని నివేదిక.. కేంద్రం రియాక్షన్ ఏంటి ?

Bigtv Digital

Rahul Gandhi : తెలంగాణలో పొత్తులపై రాహుల్ గాంధీ క్లారిటీ..

BigTv Desk

Chennai Floods: వీడని వరద.. 17కు పెరిగిన మృతులు.. 61,666 పునరావాసాలు ఏర్పాటు

Bigtv Digital

Leave a Comment