
Congress Strategy : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ గెలుపు తెలంగాణకు ఎంత అవసరమో ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల తమతమ నియోజకవర్గాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళుతున్నారు. ఇలా క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతోంది.
ప్రస్తుతకాలం క్షేత్రస్థాయి ప్రచారంతోపాటు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా అంత్యత ముఖ్యమైన అంశం. అందుకే కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయడానికి కొత్త టీమ్‌లు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోని 350 మంది సభ్యులతో కూడిన బెంగళూరు వార్ టీమ్ హైదరాబాద్ చేరుకుంది. రాత్రి ఇందిరాభవన్‌లోని వార్ రూమ్‌ను సందర్శించింది.
సోషల్ మీడియా కోసం 30 గ్రూపులుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది సునీల్ కనుగోలు టీం. ఒక్కో బృందంలో 10 మంది ఉంటారు. మొత్తం 300 మంది సభ్యులతో 30 బృందాలు ఫామ్ చేస్తున్నారు. మరో 50 మందిని వార్ రూమ్‌కు అటాచ్ చేశారు. ప్రతి బృందం ఉమ్మడి జిల్లాల్లో పనిచేయనుంది. ఇక కేసీఆర్ స్పీచ్‌లు,బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరో టీమ్ పనిచేయనుంది. వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ పథకాలు అమల్లో ఫెయిల్ ఇలాంటి అంశాలపై కూడా ఇకపై ఈ టీమ్‌ల ఆధ్వర్యంలోనే ప్రచారం కొనసాగనుంది. పార్టీ, అభ్యర్థి వీక్‌గా ఉన్న ఏరియాల్లో ప్రత్యేక కార్యాచరణను రెడీ చేస్తోంది సునీల్ కనుగోలు టీమ్. ఇలా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది.
.
.
.