
Karimnagar Cable Bridge: కరీంనగర్ మానేరుపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యతా లోపాలను బయటపెట్టింది బిగ్ టీవీ. వరుస కథనాలు ప్రసారం కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. కేబుల్ బ్రిడ్జ్‌పై హుటాహుటిన మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ రినోవేషన్ పనులు జరుగుతున్నాయి.
ఈ బ్రిడ్జ్ ప్రారంభమైన నాలుగు నెలల్లో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడం ఇది మూడోసారి. అంటే అధికారులు ఎంత నాణ్యతతో తమ పనులు చేస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మొదట వంతెన సైడ్ వాల్‌కి పగుళ్ళు రావడంతో పాటు తారురోడ్డు లేచిపోయింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ నాయకులు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన కూడా చేశారు. కొత్తగా వేసిన రోడ్డుపై తారు లేచిపోవడం కామన్ అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఇప్పుడు మరోసారి కేబుల్ బ్రిడ్జ్ రోడ్డుపై తారు లేచిపోవడంతో పనులు చేపట్టారు.
మానేరుపై 181 కోట్ల అంచనాలతో 2017 డిసెంబరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వంతెన నిర్మాణానికి సుమారు ఐదేళ్లు పట్టగా మొత్తం 224 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. జూన్ లో మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
తెలంగాణలో రెండు తీగల వంతెనలు నిర్మించిగా హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై ఒకటి, కరీంనగర్ లో రెండోది నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగెల వంతెన కరీంనగర్‌కు కొత్త పర్యాటక శోభ తెస్తుందని గొప్పలు చెబుతుండగా… ప్రారంభించిన నాలుగు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఇలా పగుళ్లు రావడంతో నాణ్యత లోపాల కారణంగా పరువు పోయే పరిస్థితి రావడంతో పాటు.. ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది.
.
.