Dog Bite : కుక్కకాటు.. ప్రతి పంటిగాటుకు ప్రభుత్వం రూ.10వేలు చెల్లించాలి.. కోర్టు తీర్పు

Dog Bite : కుక్కకాటు.. ప్రతి పంటిగాటుకు ప్రభుత్వం రూ.10వేలు చెల్లించాలి.. కోర్టు తీర్పు

Share this post with your friends

Dog Bite : వీధి శునకాల దాడుల ఘటనలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయనే వాదన అంతటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక శునకం దాడి కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఒక తీర్పు వెలువరించింది.

వీధుల్లో పలు మూగజీవాల దాడిలో గాయపడిన బాధితులతో కూడిన 193 పిటీషన్లు పంజాబ్ హర్యాణా కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటీషన్లని ఒకేసారి విచారణ చేసి ఓ ఆసక్తికర తీర్పు చెప్పింది.

ఆ తీర్పులో వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి చేస్తే బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని చెప్పింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలి, గాయం తీవ్రంగా ఉంటే రూ.20 వేల దాకా చెల్లించాలని తీర్పునిచ్చింది. క్లెయిమ్‌ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని పేర్కొంది.

‘పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది’ అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో వెలువరించింది.

ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీ నియమించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Jogi Ramesh Comments : వాళ్లిద్దరి కలయిక వ్యాక్సిన్ కాదు.. వైరస్

Bigtv Digital

JP Nadda: BRS తర్వాత VRS..కేసీఆర్ కు గుడ్ బై చెప్పాలన్న నడ్డా..

BigTv Desk

Bombay IIT news : వెజ్‌-నాన్‌వెజ్‌ ..బాంబే ఐఐటీలో మరో వివాదం..

Bigtv Digital

Allu Arjun: బన్నీతో మురుగదాస్‌ మూవీ.. ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ!

Bigtv Digital

Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్.. 15 రోజుల డెడ్ లైన్.. ఎందుకంటే..?

Bigtv Digital

Himachal Pradesh : కుప్పకూలిన ఆలయం.. 9 మంది మృతి.. కొండచరియలు విరిగిపడి..

Bigtv Digital

Leave a Comment