Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ డైలాగ్.. లేట్ అయినా లేటెస్ట్ గా వైరల్ ..

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ డైలాగ్.. లేట్ అయినా లేటెస్ట్ గా వైరల్ ..

Vijay Devarakonda
Share this post with your friends

Vijay Devarakonda : సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టంగా మారుతుంది. ఒక్కొక్కసారి ఎప్పటివో పాత సంగతులు కూడా బయటకు తీసుకువచ్చి వాటిని ఫుల్ పాపులర్ చేయడం సోషల్ మీడియాలో కామన్ అయిన విషయం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లో ఒక డైలాగ్ కూడా ఇదే టైప్ లో వైరలైపోయింది. వచ్చే సంక్రాంతికి విజయ్ దేవరకొండ తన రౌడీ గెటప్ ను పక్కనపెట్టి పక్కా ఫ్యామిలీ మెన్ గా ఫ్యామిలీ స్టార్ మూవీ తో వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. అందరూ ఎక్కువగా “బాబాయ్ హడావిడిలో కొబ్బరికాయ మర్చిపోయాను అందుకే తలకాయ కొట్టేశాను” అనే డైలాగ్ పై ఎక్కువ దృష్టి పెట్టారు . కాని ఆ ట్రైలర్ లోనే ఉన్న మరొక డైలాగ్ గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. పలు చిత్రాల పవర్ఫుల్ సీన్స్ కి ఈ డైలాగ్ ని యాడ్ చేసి మరి మిమర్స్ తమ టాలెంట్ అంతా చూపిస్తున్నారు.

ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటో అనుకుంటున్నారా.. అదేనండి విజయ్ దేవరకొండ ని కాంట్రాక్టర్ బెదిరించినప్పుడు మెల్లిగా పైకి లేచి బెంచ్ పై ఉన్న ఇనుప చువ్వల దగ్గరకు వెళ్లి.. అవేవో చిన్న చెట్టు కొమ్మలు అన్నట్టు వంచుతూ..”ఐరన్నే వంచాలా ఏంటి”అని విజయ్ దేవరకొండ డైలాగ్ వేస్తాడు చూడండి. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఈ డైలాగ్ గురించి పెద్దగా పట్టించుకోని వారు కూడా ఇప్పుడు ఈ డైలాగ్ కి వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోతున్నారు.

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ‘ఐరన్నే వంచాలా ఏంటి’ డైలాగ్ ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతుంది. అంతేకాదు దీని మీద పలు రకాల జోక్స్ తో పాటు మీమ్స్ కూడా ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలు నటించిన పాపులర్ సీన్స్ అన్నిటికీ ఈ డైలాగ్ ని ఆడ్ చేసి పెద్ద ట్రెండింగ్ గా మారుస్తున్నారు. మరి ముఖ్యంగా మిర్చిలో ప్రభాస్ కు ఈ డైలాగ్ ఆడ్ చేసింది సూపర్ వైరల్ అయింది.

మిర్చి మూవీ లో ప్రభాస్ తన ఫ్యామిలీ మీద జరిగే అటాక్ ని ఆపుతాడు.ఆ తర్వాత విలన్ అతని మనుషులకి కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నా ఫ్యామిలీ సేఫ్.. అని ప్రభాస్ అంటుంటే థియేటర్లో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ డైలాగ్ ప్లేస్ లో ‘ఐరన్నే వంచాలా ఏంటి’ అనే డైలాగ్ పెట్టి క్రియేట్ చేసిన ఒక మీమ్ సూపర్ వైరల్ అయింది.ఈ డైలాగ్ వైరల్ అవడంతో ‘ఐరన్నే వంచాలా ఏంటి’ అనే డైలాగ్ హైలెట్ అవుతూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Election Notification : తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్లు షురూ

Bigtv Digital

Virat Kohli Birthday Special Story : కష్టమంటే ఏమిటో.. విరాట్‌కే తెలుసు!

Bigtv Digital

Revanth Reddy: దారుణం.. ఘోరం.. రేవంత్‌ను జైల్లో అంతగా టార్చర్ చేశారా?

Bigtv Digital

ISRO : మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపే నింగిలోకి..

Bigtv Digital

Yashoda Twitter Review : సినిమాకు సమంత లైఫ్‌లైన్.. సెకండ్ హాఫ్ సూపర్బ్..

BigTv Desk

TS Elections 2023 : సీఎం రేసులో కిషన్ రెడ్డి లేరు.. మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు

Bigtv Digital

Leave a Comment