
Hardik Pandya : వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లన్నీ మంచి రసవత్తరంగా నడుస్తున్నాయి. పైన ఉండాల్సిన వాళ్లు దిగువన ఉంటున్నారు. ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్లుగా ఉన్న శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్తాన్ తడబడుతున్నాయి. ఈ దశలో ఆఫ్గనిస్తాన్ మెరుపులు మెరిపిస్తోంది. ఈ టైమ్ లో ఇండియా జట్టులో ఆల్ రౌండర్ మాత్రమే కాదు..స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా గాయం ఇంకా తగ్గలేదు. ఆదివారం లక్నో లో ఇంగ్లండ్ తో జరగనున్న మ్యాచ్ లో ఆడటం అనుమానమే అంటున్నారు. ఆ తర్వాత నవంబర్ 2న ముంబయిలో శ్రీలంకతో జరిగే మ్యాచ్ కి కూడా దూరమయ్యేలాగే ఉన్నాడు.
పుణెలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ లో ఫీల్డింగ్ చేస్తూ బాల్ ని కాలితో ఆపి గాయపడ్డాడు. అది చీలమండకు బలంగా తగలడంతో అక్కడే విలవిల్లాడి గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పాండ్య బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో ఉన్నాడు. హార్దిక్ ఇంకా మందులు వాడుతున్నాడు. ఎడమ చీలమండ వాపు బాగా తగ్గింది. వారాంతానికి బౌలింగ్ చేయడం ప్రారంభిస్తాడు.ప్రస్తుతం అతను కోలుకోవడానికి సమయం ఇవ్వడం ముఖ్యం..అని ఎన్ సీఏ వర్గాలు తెలిపాయి.
పాండ్యా విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. అతడికి పూర్తిగా నయమయ్యేంత వరకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో వరుసగా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఇంకో విజయం సాధిస్తే దాదాపు సెమీస్ కి చేరినట్టే…అందువల్ల సెమీ ఫైనల్ సమయానికి హార్దిక్ పాండ్యాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకి బదులుగా మహ్మద్ షమీని తీసుకున్నారు. మొదటి మ్యాచ్ తోనే అద్భుత ప్రదర్శనతో తను ఆకట్టుకున్నాడు. దీంతో అతన్ని తొలగించడం ఆత్మహత్యా సదృశ్యమనే చెప్పాలి. అలాగని ఆట ప్రారంభంలో, మధ్యలో వికెట్లు తీసే సిరాజ్ ని తీయలేరు.ఇండియన్ పిచ్ లన్నీ స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటాయి. అందువల్ల కులదీప్ ని తప్పించలేరు. జడేజా కి సపోర్ట్ కావాలి. ఈ పరిస్థితుల్లో రానున్న రెండుమ్యాచ్ ల్లో హార్దక్ ఆడడు కాబట్టి, షమీ స్థానం పక్కా అయ్యింది. కాబట్టి మిగిలిన మ్యాచ్ ల్లో బ్రహ్మాండమైన పెర్ ఫార్మెన్స్ ఇస్తే మాత్రం సిరాజ్ ని పక్కన పెట్టి షమీని ఫైనల్ వరకు తీసుకువెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ రాహుల్ సందర్శన.. పోలీసుల ఆంక్షలు..