
Karthika Masam 2023 : నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. చంద్రుడు.. కృత్తికా నక్షత్రంతో కూడి ఉండటం చేత దీనికి కార్తీకం అనే పేరు వచ్చింది. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణువుకు సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తము, గంగకంటే పుణ్య తీర్థము లేవని పురాణ వచనం.
కార్తీక మాసము శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసము. ఇది పుణ్యస్నానాలకు, వివిధ వ్రతములకు అత్యంత శుభప్రదమైనది. ఈ నెలలో ఒంటిపూట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించటం ఎంతో పుణ్యప్రదమని, అలా దీపాలు వెలిగించలేని వారు.. ఆరిన దీపాలు వెలిగించినా, దీపాలు ఆరిపోకుండా చేతి అడ్డుగా పెట్టినా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం, బిల్వపత్రాలతో శివుని అర్చన, అభిషేకం, సాయంత్రం దీపారాధన చేస్తారు. అలాగే ఈ మాసంలో ‘కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చొప్పున పారాయణం చేయటం విశేష ఫలితాన్నిస్తుంది.
కార్తీక మాసం తొలిరోజు సాయంత్రం నుంచే దేవాలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపానికి నమస్కరించి, శివాలయంలో దీపారాధన చేసినవారికి మరుజన్మ ఉండదని శాస్త్రవచనం. ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి, ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి వంటి దినాలు శివ,కేశవ అర్చనకు ఎంతో ప్రశస్తమైనవి.
BRS MLA : లాయర్ పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడి.. బాధితుడికి రేవంత్ పరామర్శ..