LSG vs GT IPL 2023 : చిన్న టార్గెట్ కొట్టలేకపోయిన లక్నో.. గుజరాత్‌కు మరో విజయం

LSG vs GT IPL 2023 : చిన్న టార్గెట్ కొట్టలేకపోయిన లక్నో.. గుజరాత్‌కు మరో విజయం

LSG vs GT IPL 2023
Share this post with your friends

LSG vs GT IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయింది. లక్నో వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓడింది. గుజరాత్ ఇచ్చిన 136 పరుగుల స్వల్ప టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్.. మాత్రమే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ ఫర్వాలేదనిపించాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో 19 బాల్స్ లో 24 రన్స్ చేశాడు. కృనాల్ పాండ్యా బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించాడు. 23 బాల్స్ కు 23 పరుగులు చేశాడు. అయితే, ఓ దశలో గెలుస్తున్నట్టే కనిపించిన లక్నో… ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లకు 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గుజరాత్ 135 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ లో హార్దిక్ పాండ్యా,  వృద్దిమాన్ సాహా రాణించారు. వృద్దిమాన్ సాహా 37 బంతుల్లో 47 పరుగులు, హార్దిక్ 50 బంతుల్లో 66 పరుగులు చేశారు.

ముఖ్యంగా లక్నో బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. శుభ్ మన్ గిల్ ఖాతా డకౌట్ అయ్యాడు. అభినవ్ ముకుంద్ సైతం 3 పరుగులకే వెనుదిరిగాడు. విజయ్ శంకర్ జస్ట్ పది పరుగులు, మిల్లర్ 6 రన్స్, రాహుల్ తివాటియా 2 పరుగులు మాత్రమే చేశారు.

లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. స్టోయినిస్ కు రెండు వికెట్లు దక్కాయి. నవీన్ అల్ హక్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Election Results 2023: మూడు రాష్ట్రాల్లో హోరా హోరీ.. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ లీడింగ్

Bigtv Digital

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్ ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bigtv Digital

CM KCR : కేసీఆర్ పాలనలో కునారిల్లిన విద్యా వ్యవస్థ.. నిరుద్యోగులకు శఠగోపం..

Bigtv Digital

Eng vs Aus Test update : లార్డ్స్‌ స్టేడియంలో హంగామా.. మ్యాచ్‌ను అడ్డుకున్న నిరసనకారులు..

Bigtv Digital

Kothagudem : కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. బీఆర్ఎస్‌ చీలిక సీపీఐకి కలిసి రానుందా?

Bigtv Digital

Heroines: ప్రాణాంతక వ్యాధులు.. ధైర్యంతో పోరాటం.. చివరికి..!

Bigtv Digital

Leave a Comment