
Maa Oori Polimera 3 Update(Telugu Cinema News):
మా ఊరి పొలిమేర.. 2021లో ఎటువంటి హడావిడి లేకుండా నేరుగా ఓటీటీ లో విడుదలై సంచలనం సృష్టించిన మూవీ. ఒక ఊరిలో జరిగే వరుస హత్యలు నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో ఈ మూవీ ఓటీటీ లో బాగా హిట్ అయింది. ఇప్పుడు తిరిగి ఈ చిత్రానికి సీక్వెల్ గా మా పూరి పొలిమేర 2 మూవీ ని గ్రాండ్ గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు అనిల్ విశ్వనాథ్ వహిస్తున్నారు.
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య,సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో భయం పుట్టించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ట్రైలర్ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.
మామూలు గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీ కు బ్లాక్ మ్యాజిక్, మంత్ర తంత్రాలు కాన్సెప్ట్ ని యాడ్ చేసి మా ఊరి పొలిమేర-2 చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ట్రైలర్ చూస్తే ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది అన్న విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం పాడేరు, కేరళ ,ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలలో తీయడం జరిగింది. ఈ మూవీ మొదటి భాగంలో చనిపోయినట్లు చూపించిన కొమిరి, గర్భిణిగా ఉన్న కవిత క్లైమాక్స్లో కేరళలో ఉన్నట్టు చూపించారు. ఈ పార్ట్ లో వాళ్ళు ఎలా బతికారు అన్న మిస్టరీ సాల్వ్ అవుతుంది.
ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్ట్ మరింత భయానకంగా ఉంటుంది అన్న విషయం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాసు స్పష్టం చేశారు. అంతేకాదు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుసగా సీక్వెల్స్ పర్వం ..సినిమాటిక్ యూనివర్స్ ల హవా నడుస్తోంది. అందుకే అదే ట్రెండు ని కొనసాగిస్తూ పొలిమేరా సినిమాను ఓ ఫ్రాంచైజ్ గా ముందుకు తీసుకు వెళ్లడానికి మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఇదే విషయంపై రీసెంట్గా ఈ మూవీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొదటి భాగం కంటే కూడా సెకండ్ పార్ట్ పదిరెట్లు ఎక్కువ థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పిన డైరెక్టర్ మూడో పార్ట్ కూడా కథ రాయడం స్టార్ట్ చేసేసాను అని అన్నారు. కావాలని రెండవ భాగం మా ఊరి పొలిమేర 2 లో అక్కడక్కడ కొన్ని లూప్ హోల్స్, బ్లాక్స్ వదిలేసాను అని చెప్పిన డైరెక్టర్ వాటిని సరిచేసుకుని మూడో పార్ట్ రెడీ చేస్తాను అని తెలిపారు. పైగా మూడో పార్ట్ భారీ స్థాయిలో ఉంటుందట.. అందులో స్టార్ హీరోలు కూడా ఆడే అవకాశం ఉన్నట్లు చూచాయిగా డైరెక్టర్ తెలియజేశారు.