
Mangalavaram Movie Review : ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి మూవీస్ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆర్ఎక్స్ 100 లో క్లైమాక్స్ తో అతను మంచి బజ్ క్రియేట్ చేశాడు. మరోసారి తన ఫేవరెట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తో కలిసి “మంగళవారం” మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ కు, డైరెక్టర్ అజయ్ భూపతికి ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.
కథ
మహాలక్ష్మీపురం అనే చిన్న గ్రామం. అందులో రవి, శైలు (పాయల్ రాజ్‌పుత్) చిన్ననాటి స్నేహితులు. అయితే ఒకరోజు జరిగిన అగ్నిప్రమాదంలో రవి చిన్నతనం లోనే మరణిస్తాడు అని శైలు భావిస్తుంది. ఇదిలా ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో ప్రతి మంగళవారం అనుకోకుండా చావులు వరుసగా సంభవించడం మొదలవుతాయి. దానితో పాటు ఊరిలో అక్రమ సంబంధం ఉన్న వారి అందరి పేర్లు ఊరిలో గోడలపై రాసి ఉంటుంది.
అలా ఎవరి పేరు అయితే రాసి ఉంటుందో వాళ్ళు ఆ మరుసటి రోజు తెల్లవారునే మరణిస్తూ ఉంటారు. ఇంతకీ గోడల మీద పేర్లు రాసేది ఎవరు? ఊరి జనాన్ని చంపుతున్నది ఎవరు? ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మాయ (నందితా శ్వేత) పై ఊరి జనం ఎందుకు అనుమానపడతారు? ఇవన్నీ తెలియాలంటే పూర్తి సినిమా తెరపై చూడాల్సిందే..
విశ్లేషణ:
నిజానికి మంగళవారం స్టోరీ ఓవరాల్ గా చెప్పాలి అంటే కొత్త కథ ఏమీ కాదు. ఒక ఊరు.. ఆ ఊరిలో వరుస హత్యలు .. అనుమానితులు వేరు.. నిందితులు వేరు.. చివరికి బయటపడే నిజం వేరు.. నిర్దోషులపై అనుమానం వచ్చేలా క్రియేట్ అయ్యే స్క్రీన్ ప్లే.. చివరిలో మంచిగా కనిపించే వాళ్ళే అసలు దోషులు అని తేలడం. ఇలాంటి స్క్రీన్ ప్లే మనం చాలా సినిమాల్లో చూసాం. అయితే అజయ్ భూపతి కథను మలచిన రీతి.. సినిమా పై ఆసక్తిని పెంచుతుంది. కానీ ఎమోషన్స్ మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు అనిపిస్తుంది.
ఆర్ఎక్స్ 100లో లేడీ విలన్ పాత్ర హై లైట్ చేసి బాగా క్లిక్ అయిన అజయ్ .. హీరోయిన్స్ లో సాఫ్ట్ కార్నరే కాదు.. ఇలాంటి కోణం కూడా ఉంటుంది అని చూపించాడు. అదే ఫార్ములా ఈ మూవీ లో కూడా ట్రై చేసినట్లు కనిపిస్తుంది. మంగళవారం క్లైమాక్స్ చూస్తే అజయ్ లేడీ విలన్ ఫార్మూలా ను ఫుల్ గా అడాప్ట్ చేసుకున్నాడు అని అర్ధం అవుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. పాయల్ రాజ్‌పుత్ అందాలు ఆరబోతలో ఏ మాత్రం తగ్గలేదు. కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కదిలించడంలో మాత్రం వీక్ అనే చెప్పాలి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండే పాత్ర కావడంతో అసలు ఫేస్ లో ఇంకో ఫీలింగ్ కనిపించలేదు. అయితే పాయల్ ను ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో కేవలం అజయ్ భూపతికే మాత్రమే తెలుసేమో అనిపిస్తుంది. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్టోరీని ముందుకు తీసుకు వెళ్లారు.
చివరిగా.. ఒక్కమాటలో చెప్పాలంటే థ్రిల్లింగ్ మూవీస్ చూసేవారికి మంగళవారం మంచి వీకెండ్ ట్రీట్.