Modi Tour: కరీంనగర్, నిర్మల్ లో సభలు.. హైదరాబాద్‌లో మోదీ రోడ్ షో..

Modi Tour: కరీంనగర్, నిర్మల్ లో సభలు.. హైదరాబాద్‌లో మోదీ రోడ్ షో..

BJP
Share this post with your friends

Modi Tour : తెలంగాణలో బీజేపీ ఎన్నికల రేసులో వెనుకబడిందని ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు మార్పులు, చేర్పులతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు మేనిఫెస్టో కూడా బీజేపీ ఇంకా ప్రకటించలేదు. సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్ని కేడర్ జోష్ పెంచే ప్రయత్నం చేశారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు దీటుగా ప్రచారంలో దూకుడు పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. వరుసగా మూడు రోజులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేపట్టేలా ఈ నెల 25న కరీంనగర్‌లో నిర్వహించే జనగర్జన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 26న నిర్మల్‌లోనూ జనగర్జన సభ నిర్వహిస్తారు. ఈ సభకు మోదీ హాజరవుతారు. ఈ నెల 27న హైదరాబాద్‌ లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.

మూడు రోజుల క్రితమే హైదరాబాద్ లో బీసీ గర్జన సభను భారీ ఎత్తును నిర్వహించిన కమలం పార్టీ.. ఈ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘సమగ్ర న్యాయానికి నాంది దండోరా..చలో హైదరాబాద్‌’ నినాదంతో, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ విశ్వరూప సభను నిర్వహించనుంది. ఈ సభలోనూ మోదీ పాల్గొంచారు. అలాగే సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇలా బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచే ప్రయత్నం చేస్తోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Team India : టీమ్ ఇండియాలో చివరి నలుగురుకి బ్యాటింగ్ రాదా?

Bigtv Digital

Mohammed Shami : ఇండియా బౌలింగ్ ప్యూచర్.. మహ్మద్ షమీ

Bigtv Digital

Palani: పళనిలో గరళ మూర్తి.. అందేవి అమృతాశీస్సులు…!

Bigtv Digital

Pawan Kalyan: ఫ్యాన్స్‌ ఉన్నా ఓట్లెందుకు రాలేదు.. ప‌వ‌న్‌కు బాల‌య్య సూటి ప్ర‌శ్న‌

Bigtv Digital

AP: హోదా ఇచ్చేదేలే, పోలవరం అయ్యేదేలే.. ఏపీకి కేంద్రం షాక్

BigTv Desk

P.Susheela : గాన కోకిల పి. సుశీల అయిష్టంగా పాడిన ఆ పాట ఏమిటో తెలుసా?

Bigtv Digital

Leave a Comment