Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా రహీముల్లా తారిఖ్ హత్య!

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాది మౌలానా రహీముల్లా తారిఖ్ హత్య!

Share this post with your friends

Moulana Rahimullah Tariq : పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన మత గురువు మౌలానా రహీముల్లా తారిఖ్ సోమవారం హత్యకు గురయ్యాడు. జైషే మొహమ్మద్‌ అధ్యక్షుడు మసూద్ అజ్హర్‌కు రహీముల్లా తారిఖ్‌ సన్నిహితుడు.

సోమవారం, నవంబర్ 13న, మౌలానా రహీముల్లా తారిఖ్ ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కరాచీ నగరంలోని ఓరంగీ టౌన్‌కు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ మీద వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో రహీముల్లా తారిఖ్ అక్కడే మరణించాడు.

కొద్ది రోజుల క్రితమే పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే రహీముల్లా తారిఖ్ హత్య జరగడంతో ఈ వరుస హత్యలు ఒకే సంస్థ చేయిస్తోందని అనుమానాలు కలుగుతున్నాయి.

భారతదేశంలో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ ఇంతకుముందు రెండుసార్లు పెద్ద దాడులు చేసింది. 2001లో పార్లమెంటుపై దాడి, ఆ తరువాత 2019లో పుల్వామా అటాక్ ఘటనలలో జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులే కారణం.

13 డిసెంబర్, 2001 సంవత్సరంలో పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు అయిదుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. అందులో ఒకడు పార్లమెంటు గేటు వద్ద ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఆ తరువాత నలుగురు ఉగ్రవాదులను సెక్యూరిటీ బలగాలు కాల్చి చంపాయి. ఈ ఉగ్రవాద దాడికి జైషే మొహమ్మద్‌, లష్కరే తయ్యబా సంయుక్తంగా చేశాయి.

ఆ తరువాత 2019 సంవత్సరం, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Bigtv Digital

Malli Pelli Review: నరేశ్‌, పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’.. ఎలా జరిగిందంటే! ఎలా ఉందంటే!

Bigtv Digital

Janatha Garage Special Story : అయ్యో! వెంకన్న సామి.. మైనింగ్ మాఫియా నిన్నూ వదల్లేదా?

Bigtv Digital

Salaar latest update: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ రిలీజ్ వాయిదా..

Bigtv Digital

Himaja : విల్లాలో లిక్కర్ పార్టీ.. బిగ్‌బాస్ ఫేమ్‌పై కేసు నమోదు ..

Bigtv Digital

RevanthReddy : తెలంగాణలో విద్యుత్ కుంభకోణం.. కేసీఆర్ పై రేవంత్ ఆరోపణలు..

Bigtv Digital

Leave a Comment