
IT Raids : కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. 36 గంటలపాటు సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్‌లోని ఇళ్లు, పొంగులేటి బంధువు నందగిరిహిల్స్ లోని బంధువు ఇంట్లోనూ ఐటీ రెడ్స్ జరిగాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి.. పలు కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలైన ఐటీ సోదాలు.. శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. మొత్తం ఐదు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాల మధ్య స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌ను తరలించారు ఐటీ అధికారులు.
ఐటీ సోదాలపై మరోసారి స్పందించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భయమా? నాకా? అంటున్నారు. భయపడేవాడినే అయితే రూలింగ్ పార్టీ నుంచి ఎందుకు బయటకొస్తా? వచ్చినా, బీజేపీలో చేరేవాడిని కదా అంటున్నారు. ఐటీ శాఖ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తించారని, తమ సిబ్బందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తామంటూ స్ట్రాంగ్‌గా రియాక్టయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.