Game Changer Movie Update: గేమ్ ఛేంజర్.. ఒక్క పాటకు అన్ని కోట్లా? శంకర్ లెక్కలకి టాలీవుడ్ ఫిదా..

Game Changer Movie Update: ఆ ఒక్క పాటకు అన్ని కోట్లా? శంకర్ లెక్కలకి టాలీవుడ్ ఫిదా..

Game Changer Movie Update
Share this post with your friends

Game Changer Movie Update

Game Changer Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ చరణ్ కెరియర్ లో నిజంగానే ఒక గేమ్ చేంజర్ అవుతుందని మెగా అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఈసారి చెర్రీ చేయబోయే డ్యూయల్ రోల్ తండ్రీ కొడుకుల క్యారెక్టర్స్ అని తెలుస్తుంది.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. ఇక శంకర్ మూవీ అంటే స్టోరీ తో పాటు పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సినిమా బడ్జెట్ రేంజ్ లో శంకర్ తీసే పాటల ఖర్చు ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకుముందు శంకర్ మూవీలో పాటలు వీటికి పెద్ద నిదర్శనం. అందుకే ఈసారి రామ్ చరణ్ మూవీలో కూడా శంకర్ తన మార్క్ పాటలు తో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

జరగండి.. అంటూ వచ్చే ఒక్క డ్యూయెట్ సాంగ్ కోసం శంకర్ పెట్టిన ఖర్చు ప్రస్తుతం ఫిలింనగర్ లోనే కాక సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఒక పాట కోసం శంకర్ పెట్టిన ఖర్చు ఒకటి రెండు కోట్లు కాదండోయ్.. ఏకంగా పదహారు కోట్లు ఖర్చుపెట్టి ఈ సాంగ్ కోసం సెట్ వేశారట. ఇంత అద్భుతమైన సెట్ లో సాంగ్ ని చిత్రీకరించడం జరుగుతుంది. అమ్మో 16 కోట్లే ఇంతకీ ఏముంది అంత పెద్ద సెట్.. అని డౌట్ రావడం సహజమే. ఎందుకంత ఖర్చంటే.. మనం స్క్రీన్ మీద ఆ సాంగ్ చూసినప్పుడు చాలా న్యాచురల్ గా ఒక మంచి లొకేషన్ లో సాంగ్ షూట్ చేసిన అనుభూతి కలుగుతుందట.

ఇక ఈ పాటను గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదల చేయాలి అని కూడా భావిస్తున్నారట. అప్పుడే ఆ పాటకు సంబంధించిన క్లిప్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడం.. వైరల్ అవ్వడం రెండు అయిపోయాయి అనుకోండి. ఈ నేపథ్యంలో కరెక్ట్ టైం చూసుకుని ఒరిజినల్ సాంగ్ ని కూడా త్వరగా రిలీజ్ చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ పాట షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధం అయిపోయింది. కొందరు ఒక సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టడం నిజంగా వండర్ఫుల్ అని అంటుంటే. మరికొందరు రియల్ సెట్ లుక్ కోసం అంత ఖర్చు పెట్టడం దేనికి అదేదో నిజంగా రియల్ లోకేషన్ కి వెళ్లి తీసుకోవచ్చు కదా అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దసరా సందర్భంగా ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జరగండి జరగండి అనే పల్లవితో సాగే ఫస్ట్ సింగిల్ ను దీపావళి రోజు విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఎంతో కలర్ ఫుల్ గా ఉన్న ఆ పోస్టర్ లో ఇంకా కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు చెర్రీ. ఏది ఏమైనప్పటికీ శంకర్ ఈసారి గేమ్ చేంజర్ తో నిజంగానే ఇండస్ట్రీలో ఇప్పటివరకు తన ఆడుతున్న గేమ్ ని పూర్తిగా చేంజ్ చేసేలా ఉన్నాడు. మరోపక్క ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తమ అభిమాన నటుడు చెర్రీ నుంచి ఇంకా కొత్త చిత్రం రాకపోవడంతో ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తుందో.. ఇండస్ట్రీలో ఏ టైప్ గేమ్స్ చేంజ్ చేస్తుందో విడుదలయ్యాకే తెలుస్తుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

IND vs NZ Semi Final : పూజలు చేద్దాం పదండి..సెంటిమెంట్స్ వర్కవుట్ అవుతాయా?

Bigtv Digital

Salaar Vs Dunki: సలార్ పై డుంకీ మాస్టర్ ప్లాన్.. ఒకరోజు ముందే రిలీజ్..

Bigtv Digital

Uttarakhand Tunnel Rescue : ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో ట్విస్ట్.. డిసెంబర్ 25 వరకూ నో ఛాన్స్

Bigtv Digital

Varun Tej- Lavanya tripathi : వరుణ్- లావణ్య పెళ్లి ..ఇటలీలోనే ఎందుకు జరుగుతుందో తెలుసా?

Bigtv Digital

BJP: రాజేందర్, జితేందర్ రాజీ.. ఫాంహౌజ్‌లో కీలక భేటీ..

Bigtv Digital

Pawan Pracharam : తెలంగాణ ప్రచారంలో పవన్‌ కల్యాణ్‌.. బీఆర్ఎస్ ను నిలదీయలేక తడబాటు

Bigtv Digital

Leave a Comment