Rana Daggubati: మెగా 156 లో భల్లాలదేవుడు..ఇక పూనకాలు లోడింగ్ ..

Rana Daggubati: మెగా 156 లో భల్లాలదేవుడు..ఇక పూనకాలు లోడింగ్ ..

Rana Daggubati
Share this post with your friends

Rana Daggubati: మెగాస్టార్ చిరంజీవి తన మెగా 156 మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మంచి సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

తన మొదటి చిత్రం బింబిసార తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వశిష్ట. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ ని.. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలను హైలెట్ చేస్తూ.. వర్తమానానికి, వాస్తవానికి వారధిలా వశిష్ట.. బింబిసార మూవీ ను అద్భుతంగా చిత్రీకరించాడు. అందుకే సెకండ్ మూవీకే మెగాస్టార్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. మెగా 156 అనౌన్స్ మెంట్ అయితే జరిగింది కానీ ఇంకా క్యాస్టింగ్ డీటెయిల్స్ ఫైనల్ కాలేదు.

ఈ నేపథ్యంలో.. ఈ మూవీలో ప్రతి నాయకుడు పాత్ర గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. మెగా 156 లో విలన్ గా టాలీవుడ్ భల్లాలదేవుడు.. అదేనండి దగ్గుబాటి రానా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన స్టోరీని డైరెక్టర్ వశిష్ట రానాకు చెప్పడం.. స్టోరీ అలాగే విలన్ క్యారెక్టర్ నచ్చడంతో రానా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అని సమాచారం. అయితే ఇంకా ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.

ప్రస్తుతం స్టోరీలో కంటెంట్ కంటే కూడా హీరోకి పోటీగా నటించే విలన్ పాత్రలు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండాలని ఆశిస్తున్నారు. అందుకే రానా లాంటి సాలిడ్ విలన్ అయితేనే మూవీ మరింత సాలిడ్ గా ఉంటుందని భావించిన డైరెక్టర్.. రానా ని ఈ పాత్ర కోసం అనుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో మెగాస్టార్ కి జోడిగా అనుష్క అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. పైగా ఇంతవరకు వీరిద్దరి కాంబోలో మూవీ రాలేదు కూడా. స్టాలిన్ సినిమాలో ఒక్కపాటలో మాత్రం మెగాస్టార్ తో స్టెప్పులేసింది కానీ.. పూర్తిస్థాయిలో హీరోయిన్ గా చేయలేదు. కాబట్టి ఆన్ స్క్రీన్ లో వీరిద్దరూ ఎలా ఉంటారో చూడాలి మరి.

మరోపక్క సెకండ్ ఆప్షన్ గా నయనతార పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ లో నయనతార చిరంజీవి సిస్టర్ గా నటించింది. మరి ఇప్పుడు హీరోయిన్ గా సెట్ అవుతుందా అనేది ఆలోచించాలి. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ డీటెయిల్స్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి పూర్తయిన తర్వాత మెగా 156 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Revanth Reddy : కాంగ్రెస్‌ నేతల ఫోన్లు ట్యాప్.. రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు..

Bigtv Digital

Chandrababu: గన్నవరంలో ప్రభుత్వ ఉగ్రవాదం.. పోరాడుతామన్న చంద్రబాబు..

Bigtv Digital

Chandrababu: గురిపెట్టి దాడి చేశారు.. అంతా సజ్జలనే చేశారు.. అనపర్తి అరాచకంపై చంద్రాగ్రహం

Bigtv Digital

KCR: తలపై టోపీ.. కేసీఆర్ కొత్త సెంటిమెంట్ అందుకేనా!?

BigTv Desk

Viveka second wife: షమీమ్‌తో వివేకా లవ్ స్టోరీ.. ఆ బంధం దృఢమైనది..

Bigtv Digital

Pawan Kalyan: ‘వారాహి’ రెడీ.. వాహనం ప్రత్యేకతలు ఇవే…

BigTv Desk

Leave a Comment