Revanth Reddy Nirmal | నిర్మల్ మాస్టర్ ప్లాన్ ప్రజల మెడ మీద కత్తిలా వేలాడుతోంది : రేవంత్ రెడ్డి

Revanth Reddy Nirmal | నిర్మల్ మాస్టర్ ప్లాన్ ప్రజల మెడ మీద కత్తిలా వేలాడుతోంది : రేవంత్ రెడ్డి

Share this post with your friends

Revanth Reddy Nirmal | కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని టీపీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్మల్ ప్రజలకు హామీ ఇచ్చారు. నిర్మల్‌లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచార కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… “ఇంద్రకరణ్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించి బొందపెట్టడానికి వేలాదిగా తరలి వచ్చిన మీకు నా అభినందనలు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే జెండాలు ఎజెండాలు, గ్రూపులు గుంపులు పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆనాడు చెప్పిన.. ఈనాడు చెబుతున్నా.. కొడంగల్ లాగే నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు. మామా అల్లుళ్ల చేతిలో చిక్కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అన్యాయానికి గురైంది. బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ ఎడారిగా మారింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీ మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఎన్నికల కోసం మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే మాస్టర్ ప్లాన్ పేరుతో మీ భూములు గుంజుకుంటారు,” అని ఆయన హెచ్చరించారు.

ఇంద్రకరణ్‌రెడ్డి ఒక మంత్రిగా ఉండి కూడా ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని.. అలాంటి ఇంద్రకరణ్‌రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావుకు ఒక్క అవకాశం ఇవ్వండి. శ్రీహరిరావుకు ఓటు వేస్తే.. తనకు ఓటు వేసినట్లేనని రేవంత్ చెప్పారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Congress : పొంగులేటి దారిలోనే ఆ నేతలు..!కాంగ్రెస్ లో జోష్..

Bigtv Digital

Parliament: అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ రఫ్ఫాడిస్తారా!

Bigtv Digital

IND Vs AUS : వరల్డ్ కప్ ఫైనల్.. 16.2 ఓవర్ల తర్వాత బౌండరీ .. కోహ్లీ అవుట్..

Bigtv Digital

CM: ఆస్తుల్లో జగన్.. అప్పుల్లో కేసీఆర్.. సీఎంల జాబితాలో మనోళ్ల మార్క్..

Bigtv Digital

Gold Rates at May 5 : షాక్ కొడుతున్న బంగారం ధర.. మళ్లీ ఎంత పెరిగిందంటే..?

Bigtv Digital

Nizamabad: బండి, కవిత ములాకత్.. అర్వింద్‌కు ఎర్త్?.. శత్రువుకు శత్రువు మిత్రుడా?

Bigtv Digital

Leave a Comment