
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఆయనపై ఎన్నోఆరోపణలు వచ్చాయన్నారు. అయినా సరే మల్లారెడ్డికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు.
మల్లారెడ్డి చేసిన వసూళ్లలో కేసీఆర్ కు వాటాలు ఇచ్చి ఉంటారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో కాలేజీలు పెట్టుకుని మల్లారెడ్డి దందాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. చెరువు భూముల్లో కాలేజీలు పెట్టుకుని నడిపిస్తున్నారని విమర్శించారు.
జవహర్ నగర్ కు మల్లారెడ్డి ఏదైనా మంచి పని చేశారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టి.. పెద్దల భూముల్లో మాత్రం ఐటీ కంపెనీలు పెట్టుకున్నారని విమర్శించారు. జవహర్ నగర్ కు ఐటీ కంపెనీలను తీసుకొస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని కానీ నెరవేర్చలేదన్నారు.పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని బలవంతంగా తొలగించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను రేవంత్ ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అందుకే తెలంగాణను ఆగమాగం చేసిన కేసీఆర్ ను తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Telangana Congress : సీఎం అభ్యర్థిపై హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా.. ఉత్తమ్ కామెంట్..