Rohit Sharma : ఒకే దెబ్బకు ఏడు పిట్టలు.. రోహిత్ కొడతాడా?

Rohit Sharma : ఒకే దెబ్బకు ఏడు పిట్టలు.. రోహిత్ కొడతాడా?

Rohit Sharma
Share this post with your friends

Rohit Sharma

Rohit Sharma : చాలా ఏళ్లక్రితం ఒకే దెబ్బకు ఏడు పిట్టలు అనే కదా.. చాలా ఫేమస్ అయ్యింది. అదెలా అంటే ఒక గోడ మీద ఏడు పిట్టలుంటే, ఒకతను తుపాకీతో కాల్చితే.. ఎన్నుంటాయి? అనేది ప్రశ్న.. ఆ శబ్ధానికే అన్నీ ఎగిరిపోతాయి? ఏవీ ఉండవు.. అని చెప్పేవారు. కానీ కొందరు మాత్రం అందులో ఒకదానికి చెవుడు అనుకోండి, దానికి వినిపించదు కాబట్టి, ఎగరదు కదా? అనేవారు. మరొకడు నిజమే, ఒకదానికింకా రెక్కలు రాలేదనుకోండి. అదెలా ఎగురుతుంది? అనేవాడు. దీనిని తర్కశాస్త్రం అంటారు.

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో జరగనుంది. ఇప్పుడు రోహిత్ శర్మ ముంగిట ఏడు రికార్డులు ఆసక్తి కలిగిస్తున్నాయి. మనం పైన చెప్పుకున్న తర్కశాస్త్రంతో రకరకాలుగా వాదిస్తున్నారు. మరి ఇందులో రోహిత్ శర్మ ఎన్ని పిట్టలు కొడతాడు.. ఒకే మ్యాచ్ లో ఒకే దెబ్బకి అన్నీ ఎగరగొడతాడా? లేక చెవుడు, రెక్కలు రాని పిట్టలు ఆగినట్టు కొన్నింటిని అట్టే పెడతాడా? అని అంటున్నారు. ఎందుకంటే అన్నీ సాధ్యమయ్యేలాగే కనిపిస్తున్నాయి. కాకపోతే ఒక సెంచరీ కొడితే, ఒక ఆరు సిక్సులు కొడితే.. అన్ని పిట్టలు పడిపోతాయని అంటున్నారు. మరి ఆ లెక్కలేమిటో ఒకసారి చూసేద్దామా..

మొదటి పిట్ట: ఒక్క సెంచరీ నెదర్లాండ్స్ పై చేస్తే క్రికెట్ ఆడే అన్నిదేశాలపై సెంచరీలు చేసిన ఘనత రోహిత్ సొంతమవుతుంది.అలా మొదటిపిట్ట పడుతుంది. ఇప్పటికి అలా చేసినవారు సచిన్, రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు.


రెండో పిట్ట: ప్రపంచకప్ లో ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా సౌరభ్ గంగూలీ 465 పరుగులతో ఉన్నాడు. రోహిత్ మరో 24 పరుగులు జోడిస్తే ఆ పిట్ట పడిపోతుంది.


మూడో పిట్ట:  2023 వన్డే ప్రపంచకప్ లో ఇప్పటివరకు 442 పరుగులు చేసిన కెప్టెన్ మరో 58 చేస్తే చాలు 500 మార్క్ చేరుకుంటాడు.వరల్డ్ కప్ చరిత్రలో ఇలా రెండుసార్లు 500 పైగా పరుగులు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా నిలుస్తాడు. అంతకుముందు చిచ్చరపిడుగు సచిన్ పేరు మీద ఉంది. 1996లో 523, 2003లో ఏకంగా 673 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ అయితే 2019లో 5 సెంచరీలతో 648 పరుగులు చేశాడు.


నాలుగో పిట్ట: మరో 80 పరుగులు చేస్తే చాలు..ప్రపంచకప్ లో అత్యంత వేగంగా 26 మ్యాచ్ ల్లోనే 1500 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ అవుతాడు. ఇలా నాలుగు పిట్టలు కూడా 100 పరుగులు చేస్తే చాలు…టపటపా ఒకదాని వెంట ఒకటి పడిపోతాయి.


ఐదో పిట్ట: నెదర్లాండ్స్ పై గెలిస్తే ప్రపంచకప్ లో వరుసగా 9 మ్యాచ్ లు అంటే నాన్ స్టాప్ గా గెలిచిన, గెలిపించిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టిస్తాడు. మరో పిట్ట పడిపోతుంది.


ఆరో పిట్ట: ఐసీసీ ప్రపంచకప్ లో మరో 5 సిక్స్ లు కొడితే అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ సొంతమవుతుంది. ఇప్పటికి అన్ని వరల్డ్ కప్ ల్లో కలిపి 25 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 45 సిక్స్ లు కొట్టాడు. తనకన్నా ముందు యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్ 49తో సిక్స్ లతో ఉన్నాడు.


ఏడో పిట్ట: ఈ క్యాలెండర్ ఇయర్ లో 24 వన్డేల్లో 58 సిక్స్ లు కొట్టాడు. సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీడీవిలియర్స్ 58 కొట్టాడు. మరొక్క పిట్ట పడితే చాలు..ఆ రికార్డ్ సొంతమవుతుంది.
ఇదండీ సంగతి.. రోహిత్ ఏడు పిట్టల కథ..

మరి రోహిత్ శర్మ కొడతాడా? కొట్టడా? ఎన్ని ఉండిపోతాయో, ఎన్ని ఎగిరిపోతాయో చూద్దాం.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Uttarakhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌పై వీడని ఉత్కంఠ

Bigtv Digital

Karnataka Elections : కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన ప్రచారం.. నేటితో మైకులు బంద్..

Bigtv Digital

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Bigtv Digital

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

BigTv Desk

Viveka Murder Case: అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తాం.. కస్టడీలో ప్రశ్నిస్తాం.. సీబీఐ సంచలనం

Bigtv Digital

T20 WORLDCUP: సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ..కివీస్, పాక్ మధ్య తొలి సెమీస్ పోరు

BigTv Desk

Leave a Comment