
Sachin Tendulkar : క్రికెట్ రారాజు కింగ్ కోహ్లీ లాగే, క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కూడా ఒక ఆఫ్ సెంచరీ చేశాడు. కంగారుపడకండి. తను 50వ వడిలో ఉన్నాడు. అయితే విరాట్ కి ఇప్పుడు 35 ఏళ్లు.. అంటే తనకన్నా సచిన్ 15 ఏళ్లు పెద్దవాడు. అంటే అందరికీ చెప్పేదేముంది.. ఆ రోజుల్లో సచిన్ ని చూసే కదా.. ఎంతోమంది క్రికెట్ నేర్చుకునేవారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపించేవారు.
అలా క్రికెట్ నేర్చుకున్నవారిలో ఒకడే విరాట్ కోహ్లీ కూడా. అందుకే ఇప్పటికి కూడా నా గురువు సచిన్ అని కోహ్లీ అంటుంటాడు. అందుకే 50వ సెంచరీ కాగానే ముందు గ్రౌండ్ లో కూర్చుని గురువు సచిన్ కి వందనం చేశాడు. మ్యాచ్ తర్వాత సచిన్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు. కోహ్లీ తొలిరోజున ఇండియన్ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చినప్పడు మిగిలినవాళ్లు ఆట పట్టించారని, ఆ సంఘటనని సచిన్ గుర్తు చేసుకున్నాడు. అది నాకెంతో నవ్వు తెప్పించిందని అన్నాడు.
ఎందుకంటే బయట అభిమానులు నన్నెంతగానో అభిమానిస్తారు. ఆరోజు డ్రెస్సింగ్ రూమ్ లోకి తొలిసారి కోహ్లీ వచ్చాడు. అందరూ తనని ఆహ్వానించి, అక్కడ దూరంగా కూర్చున్న నా వైపు చూపించారు. ఇక్కడికెవరు కొత్తగా వచ్చినా అతని కాళ్లకి నమస్కారం పెట్టి అతన్ని తాకితే, నీకు తిరుగుండదు, ముందు అతని ఆశీర్వాదం తీసుకోమని తెలిపారు.
మావాళ్లు ప్రాంక్ చేస్తుంటే, నాకు నవ్వొచ్చింది. కానీ కోహ్లీ సీరియస్ గా నా దగ్గరికి వచ్చి కాళ్లకు నమస్కారం పెట్టబోతుంటే, నేను వద్దని వారించానని చెప్పాడు. కానీ ఈ రోజున నా హృదయం గెలుచుకున్నాడని తెలిపాడు.
కోహ్లీ ఈ ఘనతను చాలా ఈజీగా అందుకున్నాడు. చాలా తక్కువ ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ ఈ రికార్డు అందుకోవడం గ్రేట్. సూపర్.. మేం అందరం తనని చూసి గర్వపడుతున్నామని అన్నాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలతో 18,426 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ ఘనతను 279 ఇన్నింగ్స్ లోనే అందుకోవడం విశేషం.