Sapta Sagaralu Dhaati Side B Review : సప్త సాగరాలు దాటి సైడ్ బి.. మూవీ ఎలా ఉందంటే?

Sapta Sagaralu Dhaati Side – B Review : సప్త సాగరాలు దాటి సైడ్ బి.. మూవీ ఎలా ఉందంటే?

Sapta Sagaralu Dhaati Side - B Review
Share this post with your friends

Sapta Sagaralu Dhaati Side – B Review : రక్షిత్ శెట్టి.. కన్నడలో మంచి పాపులారిటీ ఉన్న ఈ నటుడు రీసెంట్‌గా సప్త సాగరాలు దాటి సైడ్ ఎ అంటూ పలకరించాడు . ఇప్పుడు సైడ్ బీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాలో ఎమోషన్స్ అందరి మనసులను టచ్ చేశాయి. మరి శుక్రవారం (నవంబర్17) థియేటర్లలోకి వచ్చిన పార్ట్ బి ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం.

కథ 

జైలు నుంచి విడుదలైన మను (రక్షిత్ శెట్టి).. ప్రియా (రుక్మిణీ వసంత్) జ్ఞాపకాల నుంచి మాత్రం విడుదల కాలేకపోతాడు. అతని మనసు మార్చడానికి స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో అనుకోకుండా మనుకి వేశ్య సురభి (చైత్ర జె అచార్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె ద్వారా ప్రియా కు పెళ్లి తర్వాత ఒక బాబు కూడా పుట్టాడని.. అయితే ప్రస్తుతం ఆమె తన పెళ్లితో సంతోషంగా లేదని తెలుసుకుంటాడు. అంతేకాదు ఆమె సింగింగ్ కూడా ఆపేసిందని అర్థం అవుతుంది. ప్రియా సంతోషంగా లేదు అని తెలుసుకుని.. తల్లడిల్లిన మను ఆమె కోసం ఏం చేస్తాడు? ప్రియా మళ్లీ పాడిందా లేదా? సురభి తో మను పరిచయం ఏ తీరం చేరుతుంది? ఈ స్టోరీ ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? తెలుసుకోవాలంటే పూర్తి సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

 విశ్లేషణ

మూవీ ఫస్ట్ పార్ట్ ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’ ద్వారా డైరెక్టర్ హేమంత్ రావ్ క్యారెక్టరైజేషన్లు, డిటైలింగ్ పరంగా ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ సెట్ చేశాడు. దీంతో సైడ్ బీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో తొలిప్రేమ ఎంతో ప్రత్యేకమైనది. కొందరికి అది దక్కుతుంది కానీ కొందరికి చేరుకోలేని సుదూర తీరంగా మిగిలిపోతుంది. ఈ స్టోరీలో హీరో ప్రేమించిన అమ్మాయికి మరొకరి తో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన తర్వాత సంతోషంగా లేదు అని తెలుసుకొని ఆమె కోసం ఆ ప్రేమికుడు ఏమి చేశాడు అనేదే మూవీ స్టోరీ.

దర్శకుడు తన పాయింట్ ని స్క్రీన్ పై ఎంతో అద్భుతంగా చూపించాడు. అయితే అక్కడక్కడ అసలు ఉద్దేశాన్ని చెప్పడంలో కాస్త తడబడ్డాడు. సైడ్ ఎ లో ఎలివేట్ అయినట్టుగా.. సైడ్ బీలో క్యారెక్టర్స్ ఎలివేట్ కాలేదనిపిస్తుంది. మన పురాణాలు.. పరస్త్రీ వ్యామోహం వంశ నాశనానికి దారితీస్తుంది అని చెబుతాయి. అయితే మూవీ రైటర్ ఈ చిన్ని లాజిక్ మర్చిపోయినట్టున్నాడు. స్టోరీలో చాలా వరకు సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉన్నాయి. హీరోయిన్ కి ఆమె భర్తకు మధ్య బంధాన్ని కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు.

మొత్తానికి సైడ్ ఎ తో పోలిస్తే సైడ్ బి కాస్త వెలవెలబోతోందని టాక్. పాటలు కూడా సైడ్ ఏ లో ఉన్నంత స్థాయిలో సైడ్ బీలో లేవు. సినిమాను ఒక రేంజ్ లో సాగదీసి వదిలారని అంటున్నారు. క్లైమాక్స్ ఫైట్స్ , ఎమోషనల్ సీన్స్ లో.. రక్షిత్ శెట్టి చాలా సహజంగా చేశాడు. ఈ మూవీలో అతని గేట్ అప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక రుక్మిణీ వసంత్ ను నార్మల్ హౌస్ వైఫ్ గా చూపించడం వల్ల ఆమె పాత్ర కు ఎక్కువ ఎమోషన్స్, వేరియేషన్స్ చూపించే స్కోప్ లేదు.

చివరిగా.. ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’ ఒక సుందరస్వప్నమైతే.. సైడ్ బి భగ్న ప్రేమకథ


Share this post with your friends

ఇవి కూడా చదవండి

VD 12:- ట్యూష‌న్‌కు వెళుతున్న రౌడీ స్టార్‌!

Bigtv Digital

Movies : ఈవారం థియేటర్లు , ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే..

Bigtv Digital

Virat Kohli: శ్రీలంకపై చెలరేగిన కొహ్లీ.. సెంచరీతో సచిన్‌ రికార్డు బ్రేక్..

Bigtv Digital

SBI: ఎస్‌బీఐ సర్వర్‌ డౌన్‌.. ఈ బ్యాంక్ ఇక మారదా?

Bigtv Digital

Revanth Reddy: ప్రమాణం చేద్దాం రా.. ఈటల వస్తారా? చార్మినార్ చౌరస్తాలో సవాల్..

Bigtv Digital

Revanth Reddy: లక్షల కోట్ల కుంభకోణం.. అంతా ఆ నలుగురి కోసం!.. రేవంత్‌రెడ్డి 111 ఆటంబాంబ్..

Bigtv Digital

Leave a Comment