
Spark Life Movie Review : విక్రాంత్ అటు హీరో గా ఇటు డైరెక్టర్ గా వ్యవహరించిన చిత్రం స్పార్క్ లైఫ్. థ్రిల్లర్ జానర్ లో సాగే ఈ మూవీ ఈరోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..
కథ:
జై (విక్రాంత్) ఒక మెడికల్ విద్యార్థి. కొందరు అమ్మాయిలని తెలియకుండానే ఎందుకో ఫాలో అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతను ఫాలో అయిన అమ్మాయిలందరూ కాసేపటికి సైకో లాగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఆ తర్వాత వాళ్ళందరూ సడన్‌గా చనిపోతారు. అసలు ఎందుకిలా జరుగుతుందన్న విషయం ఎవరికీ అర్థం కాదు. పోలీసులు కూడా అతన్ని అనుమానించి అరెస్టు చేస్తారు.
ఈ క్రమంలో అతని లవర్ రుక్సర్ థిల్లాన్ కూడా చనిపోతుంది. రుక్సర్ తర్వాత తన కూతురికి ప్రమాదం అని గ్రహించిన మెహ్రీన్ ఫాదర్ జై ను తన కూతురికి దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జై కి రెండు పేర్లు ఉన్నాయి అన్న విషయం బయట పడుతుంది. జై కి ఆర్య అన్న మరో పేరు ఎందుకు ఉంది? అసలు జరుగుతున్న విషయాల వెనుక సీక్రెట్ ఏమిటి? అమ్మాయిలు ఎందుకు అలా సైకోలాగా మారిపోతున్నారు? ఇంతమంది చనిపోవడానికి వెనుక కారణం ఎవరు? తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
మూవీకి సంబంధించిన స్టోరీని డైరెక్టర్ అద్భుతంగా రాశాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఫస్టాఫ్ లో సీక్వెన్సెస్ అన్ని కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. మూవీలో ఫస్ట్ పార్ట్ కథలో ఏం జరుగుతుంది. అసలు ట్విస్టులేంటి అన్న విషయం అర్థం కాదు. ఒక పక్క హీరో హీరోయిన్ మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ చూపిస్తూ మరో పక్క దారుణమైన హత్యలను కూడా హైలెట్ చేస్తారు.
సెకండ్ హాఫ్ మొదలవడంతో అసలు కథ స్టార్ట్ అవడం.. మెయిన్ పాయింట్ రివ్యూ అవడంతో పాటు మూవీపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆర్మీలో కొందరు డాక్టర్ లు టెర్రరిస్టులు పై చేసే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కారణంగా చావులు జరుగుతున్నాయన్న పాయింట్ ని ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేస్తారు. అక్కడక్కడ మూవీలో జాంబిరెడ్డి ఛాయలు ఈజీగా కనపడతాయి. ఒక మనిషి మెదడుని కంట్రోల్ చేస్తూ మనం ఏదైనా చేయొచ్చన్న పాయింట్ ని కూడా ఈ మూవీలో అద్భుతంగా చూపించారు.
స్టోరీ ,కాన్సెప్ట్ పరంగా మూవీ అద్భుతంగా ఉంది. అయితే దీనికి డైరెక్టర్, హీరో రెండు బాధ్యతలు విక్రాంత్ ఒక్కడే మోయడం వల్ల అక్కడక్కడ లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్లుగా ఉన్నాయి. మూవీలో అక్కడక్కడ షార్ట్ గా పెట్టి ఉంటే కొన్ని సీన్స్ బాగా హైలైట్ అయ్యేవేమో అనిపిస్తుంది. మొత్తం మీద ఈ మూవీ ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది.
చివరిగా.. లాజిక్స్ ఆలోచించకుండా.. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తే ‘స్పార్క్ లైఫ్’ మూవీ నచ్చుతుంది.