Sreeleela : అతనికే నా ఫస్ట్ కిస్.. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ డెసిషన్..

Sreeleela : అతనికే నా ఫస్ట్ కిస్.. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ డెసిషన్..

Sreeleela
Share this post with your friends

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే ఏ సినిమాల పోస్టర్ చూసినా ఆమె బొమ్మే.. ఎవరి నోట విన్నా ఆ పేరే.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల. చేసింది మూడు నాలుగు సినిమాలే అయినా చాలా తక్కువ టైంలో స్టార్ డమ్ సొంతం చేసుకుని అగ్ర హీరోలతో వరుస క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ. నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం మూవీ నిర్మాతల ఫేవరెట్ అయి కూర్చుంది. టాలీవుడ్ లో సెంటిమెంట్ల పిచ్చి ఎప్పటినుంచో కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే కదా. కొందరు హీరోయిన్లను ఐరన్ లెగ్ అని ఎలా దూరం పెట్టారో.. శ్రీలీల గోల్డెన్ లెగ్ అని ఆఫర్స్ ఇవ్వడానికి అలా ఎగబడుతున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. కష్టమైనా సరే వరుస సినిమాలు ఒప్పుకొని దూసుకుపోతోంది శ్రీలీల. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి సినిమాలు ఈమె కోసం క్యూ కడుతున్నాయి. పైగా శ్రీలీల డాన్సులు అదరగొడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బాలయ్య మూవీ రిలీజ్ తర్వాత ఫైట్లు కూడా ఇరగదీస్తుంది అని స్పష్టమైంది. తెలుగుతనానికి నిలువెత్తు నిర్వచనంలా పద్ధతిగా ఉండే శ్రీలీల ఇంతవరకూ ఏ సినిమాలోనూ హద్దులు దాటి నటించలేదు.

చాలా పక్కాగా తనకంటూ పెట్టుకున్న లిమిట్స్ ని దాటకుండా, చాలా బాలన్స్డ్ గా కేరియర్ లో ముందుకు సాగుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలకి ఓ తుంటరి ప్రశ్న ఎదురైంది. నిజానికి ఆమెకు వేసిన ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలని చాలా మంది ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్స్ చేయాల్సిన సందర్భం వస్తే.. ఎవరితో చేయడానికి ఇష్టపడతారు..? అని అడగ్గా తన మనసులో మాట చెప్పింది. ఏ హీరో తోనూ లిప్ లాక్ సీన్ చేయను అని తేల్చి చెబుతూ.. కేవలం తన భర్తకు మాత్రమే తొలి కిస్ ఇస్తాను అని స్పష్టం చేసింది. ప్రస్తుతం సినిమాలలో స్టోరీ కంటే కూడా రెండు మూడు రొమాంటిక్ సీన్స్ లేకపోతే ఆ సినిమా పండదు. మరి స్టోరీ డిమాండ్ చేస్తే అప్పుడు ఈ భామ ఏమి చేస్తుందో అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Telangana News : తెలంగాణలో పవర్ పాలిటిక్స్.. విద్యుత్ లెక్కలపై చర్చ..

Bigtv Digital

Kcr : ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారా?.. మోదీపై కేసీఆర్ ఫైర్..

BigTv Desk

Amaravati : అమరావతి ఆర్‌-5 జోన్‌.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Bigtv Digital

Rohit Sharma : రోహిత్ శర్మ ‘అదరహో’..రికార్డులు బెదరహో..నాలుగు ప్రపంచ రికార్డులు నమోదు

Bigtv Digital

Thalapathy Vijay : వెయ్యి కోట్ల సినిమాపై విజయ్ స్కెచ్…

Bigtv Digital

Samantha: హమ్మయ్య సమంత ఎంట్రీ ఇచ్చేసింది.. రౌడీ స్టార్ ‘ఖుషి’

Bigtv Digital

Leave a Comment