
Rachin Ravindra : 23 ఏళ్ల కుర్రాడు.. భారత మూలాలున్న వాడు.. న్యూజిలాండ్ టీమ్ లో అదరగొడుతున్నాడు. మూడు సెంచరీలు చేశాడు. అటు బౌలింగ్ చేసేస్తున్నాడు. ఇటు బ్యాటింగ్‌లో దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ లో 565 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.
ఇంతకీ ఎవరీ రచిన్ రవీంద్ర..? అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. రచిన్ తండ్రి రవి క్రష్ణమూర్తి ఆర్కిటెక్చర్. ఉద్యోగరీత్యా ఆయన న్యూజిలాండ్ దేశంలోని వెల్లింగ్టన్ లో స్థిరపడ్డారు. తల్లి పేరు దీపా క్రష్ణమూర్తి. బెంగళూరు స్వస్థలం. రచిన్ తాతయ్య బయాలజీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్తగా ఆయనకు పేరుంది.
ఇకపోతే వెల్లింగ్టన్ లో రచిన్ 1999లో జన్మించాడు. అయితే తండ్రి రవి క్రష్ణమూర్తికి క్రికెట్ అంటే ప్రాణం. న్యూజిలాండ్ లో స్థిరపడకముందు బెంగళూరులో క్లబ్ స్థాయి క్రికెట్ ఆటగాడుగా ఉన్నాడు. ఆ ఇంట్రస్ట్ తోటే కొడుక్కి క్రికెట్ నేర్పించాడు. అలా ఐదేళ్ల వయసులోనే రచిన్ బ్యాట్ పట్టుకున్నాడు. అయితే రచిన్ కి ఒక సోదరి ఉంది. పేరు ఐసిరి. ఇంక మనోడికి ఒక చక్కని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తన పేరు ప్రమీలా మోరర్.
ఇంతకీ తనకి రచిన్ అనే పేరు ఎలా పెట్టారనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. తను చిన్నతనం నుంచి సచిన్ ఆటను చూస్తూ ఎదిగాడు. అతనినే ఇన్సిపిరేషన్ గా ఆడాడు. కాకపోతే మొదట తనపేరు పోర్ట్ మంట్యూ. కాకపోతే తల్లిదండ్రులు క్రికెటర్ ని చేయాలని భావించారు.
అందుకనే రాహుల్ ద్రవిడ్ లోని ‘ర’ని, సచిన్ లోని..‘చిన్’ తీసి రచిన్ అని పెట్టారు. దీంతో ఆ పేరు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎందుకంటే సచిన్ కి దగ్గరగానే ఆ పేరు కూడా ఉంది. అతను సచిన్, ఇతను రచిన్…ప్రాస కూడా కుదిరింది. భారత దిగ్గజాల పేర్లు పెట్టుకున్న రచిన్ వారి పేర్లను నిలబెట్టేలాగే కనిపిస్తున్నాడు.
క్రికెట్ నేర్చుకునే క్రమంలో ప్రతి ఏడాది బెంగళూరు వచ్చి తండ్రి ఆడిన క్లబ్ లోనే రచిన్ క్రికెట్ ఆడేవాడు. బహుశా ఇండియన్ టీమ్ కి ట్రై చేసి ఉంటారు. కానీ ఇక్కడ విపరీతమైన కాంపిటేషన్, రాజకీయాలు పడలేక, కివీస్ తరఫున ఆడించారు. అలా అక్కడ అండర్ 19లో చోటు సంపాదించుకున్న రచిన్ అతి త్వరలోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇండియా గడ్డపై ఇరగదీస్తున్నాడు. చూశారు కదండీ.. ఇదీ మన రచిన్ రవీంద్ర నేపథ్యం. విదేశీ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న మన భారతీయ సంతతి ఆటగాడు మరెన్నో మెట్లు అధిరోహించాలని ఆశిద్దాం.