Suella Braverman : బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లాపై వేటు.. ప్రధాని సునక్ కీలక నిర్ణయం.. కేబినెట్‌లో మాజీ ప్రధాని

Suella Braverman : బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లాపై వేటు.. ప్రధాని సునక్ కీలక నిర్ణయం.. కేబినెట్‌లో మాజీ ప్రధాని

Share this post with your friends

Suella Braverman : బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak)దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేరవర్మెన్‌ను పదవి నుంచి తొలగించారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలతో పాటు ఆమె సొంత పార్టీ నాయకుల విమర్శించడంతో రిషి సునక్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి కారణం.. ఇటీవలే సుయెల్లా బ్రేరవర్మెన్‌ ఒక వార్తా పత్రికలో సంపాదకీయ ఆర్టికల్ రాశారు. అందులో ఆమె లండన్ పోలీసులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల వల్లే ఆదివారం రెండు నిరసన గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనలో 14 మంది నిరసనకారులు, 9 మంది పోలీసలు తీవ్రంగా గాయపడ్డారు.

సుయెల్లా బ్రేరవర్మెన్‌ చేసిన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో అనేకమంది అమాయక పౌరులు, చిన్నపిల్లలు చనిపోతుండడంతో లండన్ వీధులపై భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. అయితే ఆ నిరసనలు నిర్వహిస్తోంది.. హమాస్‌తో సంబంధమున్న ఒక సంస్ధ అని, ఆ సంస్థకు లండన్ పోలీసులు మద్దతుగా నిలిచారని ఆమె ఒక ప్రతికా సంపాకీయంలో రాశారు. అలాగే.. పాలస్తీనాకు మద్దతుగా నిరసన చేసిన వారందరూ రౌడీలని, హింసను ప్రేరేపించేవారని సుయెల్లా పేర్కొన్నారు.

మరుసటి రోజే అంటే ఆదివారం సుయెల్లా చేసిన వ్యాఖ్యలతో కొందరు ఇజ్రాయెల్ మద్దతుదారులు కూడా రోడ్డుపైకి వచ్చారు. పాలస్తీనా మద్దతుదాల నిరసన ప్రదేశంలో వారు కూడా వచ్చి నిరసన మొదలు పెట్టారు. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయలయ్యాయి.

కానీ అంతుకుముందే.. మీడియా సమావేశంలో ప్రధాని రిషి సునక్ మాట్లాడుతూ.. పాలస్తీనాకు మద్దతుగా జరిగే నిరసనలు శాంతియుతంగా జరుగుతున్నాయని.. అలా నిరసన చేయడం వారి హక్కు అని అన్నారు. దీంతో సుయెల్లా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. ప్రతిపక్షాలు, ఆమె సొంత పార్టీ నాయకులు మండిపడ్డారు.

సుయెల్లా బ్రేవర్మెన్‌ని లండన్ పోలీస్ కమిషనర్ కూడా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే అధికారం అందరికీ ఉందని.. అందుకే పాలస్తీనాలో కాల్పుల విరమణ కోరి చేసే శాంతియుత నిరసనకు అనుమతి తప్పక ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఒక హోం మంత్రి స్థాయి వ్యక్తి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు.. ఏమన్నా ఉంటే కేబినెట్‌ మీటింగ్‌లో ఆమె అభిప్రాయం చెప్పాల్సింది అని చెప్పారు.

కేబినెట్‌లో మాజీ ప్రధాని
ప్రధాన మంత్రి రిషి సునక్ ముందు ఆమెను సమర్థించినా.. అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం కారణంగా సుయెల్లాను హోం మంతి పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లేవర్లీకి హోం శాఖ బాధ్యతలు అప్పిగించారు. అయితే విదేశాంగ మంత్రిగా బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్‌ కామెరాన్‌‌ను నియమించారు. ఇలా ఒక మాజీ ప్రధానిని మళ్లీ కేబినెట్ పదవి ఇవ్వడం ఆ దేశ రాజకీయాల్లో ఇదే తొలిసారి. డేవిడ్ కామెరాన్‌ ఇంతకుముందు 2010 నుంచి 2016 వరకు యూకే ప్రధాన మంత్రిగా పనిచేశారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

US Mass Shooting : అగ్రరాజ్యంలో కాల్పులు.. 22 మంది మృతి

Bigtv Digital

YSR Awards : వైఎస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ అవార్డ్స్‌.. గవర్నర్ చేతులమీదుగా అందుకున్నది వీరే..

Bigtv Digital

Kalyanam Kamaneeyam:”కళ్యాణం కమనీయం” ఒక లైఫ్ ఎక్సీపియరెన్స్ – హీరో సంతోష్ శోభన్

Bigtv Digital

Minister Roja | రక్షణ కల్పించండి.. మంత్రి రోజాపై డీజీపీకి ప్రేమజంట ఫిర్యాదు..

Bigtv Digital

Doctor: డాక్టర్‌ను పొడిచి చంపిన టీచర్.. చికిత్స చేస్తుండగా దారుణం..

Bigtv Digital

Ponguleti: బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేది కాంగ్రెస్సే.. పొంగులేటి ఫైర్..

Bigtv Digital

Leave a Comment