
Mahesh Babu : మహేష్ బాబు.. సినిమా యాక్టర్ కంటే కూడా సంఘసేవకుడిగా ఎందరో జీవితాలలో వెలుగు నింపారు. మొదటినుంచి సమాజ సేవ చేయాలి అని ఆరాటంతో పాటు సేవా దృక్పథం కలిగిన మహేష్ ఎందరో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఎంబీ పౌండేషన్ సంస్థ ద్వారా ఎందరో నిర్భాగ్యులకు అండగా నిలుస్తున్నారు.
ఇప్పటికీ ఈ సంస్థ అందిస్తున్న పలు రకాల సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా తమ స్వగ్రామమైన బుర్రిపాలెం ను దత్తత తీసుకొని ఆ గ్రామానికి ఎన్నో రకాల వసతులను కల్పించారు మహేష్ బాబు. ఈ ఫౌండేషన్ భాద్యతలు మహేష్ బాబు తో పాటు అతని భార్య నమ్రత శిరోద్కర్ కూడా నిర్వహిస్తుంటారు. ఫౌండేషన్ కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఆమె దగ్గర ఉండి చూసుకుంటారు.
రీసెంట్‌గా వీళ్ళ కుమార్తె సితార..తన మొదటి జువెలరీ యాడ్ కు గాను అందుకున్న పారితోషకాన్ని కూడా విరాళంగా కేటాయించి.. తండ్రికి తగ్గ కూతురు అని ప్రూవ్ చేసుకుంది. చనిపోయిన ఆమె నాయనమ్మ జ్ఞాపకార్థం ముసలి అవ్వలకు ఈ చిన్నారి తన చేతనైన సహాయాన్ని అందించింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతిని పురస్కరించుకొని మహేష్ బాబు తీసుకున్న మరో నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తండ్రి పేరు పదిమందికి గుర్తు ఉండడమే కాదు .. పది ఇళ్లల్లో దీపం వెలిగించే విధంగా ఉండాలి అని భావించిన మహేష్ బాబు కృష్ణ జ్ఞాపకార్థం ఒక ఎడ్యుకేషనల్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఫండ్ ఆధ్వర్యంలో 40 మంది అర్హులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడం కోసం అయ్యే ఖర్చు మహేష్ బాబు ఫౌండేషన్ చూసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలను మహేష్ బాబు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తూ అభిమానులు మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
.
.