Jr NTR : టైగర్ 3 లో వార్ 2 కొత్త విలన్ ..ఆ హైప్ అంతా తారక్ కోసమేనా?

Jr NTR : టైగర్ 3 లో వార్ 2 కొత్త విలన్ .. ఆ హైప్ అంతా తారక్ కోసమేనా?

Jr NTR
Share this post with your friends

Jr NTR : సల్మాన్ ఖాన్ ,కత్రినా కైఫ్ కాంబినేషన్లో వచ్చిన స్పై సీరియస్ మూవీ టైగర్ 3. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మొదటి రెండు చిత్రాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి. యష్ రాజ్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఎండింగ్లో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ గురించి ఒక ట్విస్టును మేకర్స్ రివిల్ చేశారు. ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్న ఈ ట్వెస్ట్ మూవీకి సంబంధించిన కొత్త శత్రువు గురించి ఎలివేట్ చేస్తూ ఉంది.

వార్ 2 గ్లింప్స్ లో హృతిక్ రోషన్ ని చూపిస్తూ.. విలన్ గురించి సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగనటువంటి కొత్త శత్రువు ఇండియాకి తయారయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఊరు, పేరు ..ఏ డేటా లేదు. పూర్తిగా చీకటిలో ఉంటాడు. అతన్ని ఎదుర్కోవాలి అంటే నువ్వు కూడా అదే చీకట్లోకి వెళ్ళాలి అని హృతిక్ కి చెప్పే సీన్ వార్ 2 మూవీలో విలన్ ఏ రేంజ్ లో ఉంటాడో చెప్పకనే చెబుతుంది.

ఇక ఆ వ్యక్తితో పోరాటం మరణం కంటే ప్రమాదం అనే డైలాగ్ మరి హైలెట్ గా ఉంది. ఈ హైప్ అంతా జూనియర్ ఎన్టీఆర్ కోసమే అన్న స్ట్రాంగ్ అభిప్రాయం టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికే వార్ 2 చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎలివేషన్ తారక్ గురించే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎలివేషన్ వరకు బాగానే ఉంది కానీ టైగర్ 3 పెర్ఫార్మెన్స్ చూశాక వార్ 2 రిసల్ట్ ఎలా ఉంటుందో అనే డౌట్ కలుగుతుంది.

వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా హృతిక్ రోషన్ లాంటిది లెజెండరీ యాక్టర్ తో ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు .పేరుకు చేసేది విలన్ రోల్ అయినప్పటికీ.. తారక్ తన నటనతో అదరగొట్టేస్తాడు అనేది కన్ఫామ్. ప్రస్తుతం దేవర షూటింగ్లో బాగా బిజీగా ఉన్నందున వార్ 2 కు సమయం కేటాయించలేకపోతున్నాడు. దేవర షూటింగ్ పూర్తయిన వెంటనే వార్ 2..ఆ తర్వాత దేవర్ 2 ని కూడా సెట్స్ మీదకు తీసుకువచ్చే అవకాశం ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..

Bigtv Digital

Sircilla : కేటీఆర్ కు షాక్.. తొలుత వెనుకంజ.. తర్వాత లీడ్..

Bigtv Digital

Revanth Reddy Delhi Tour : ఢిల్లీ టూర్‌లో రేవంత్ బిజీబిజీ.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం..

Bigtv Digital

Pakistan Cricket Board : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు?.. ఇంజమామ్ సంచలన నిర్ణయం..

Bigtv Digital

Revanth Reddy : కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. పార్టీలో చేరికలపై చర్చ..

Bigtv Digital

Leave a Comment