
Balakrishna : ఇప్పటివరకు హాలీవుడ్ కే పరిమితమైన మల్టీవర్స్ ట్రెండ్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కూడా ప్రవేశించింది. మల్టీవర్స్ ..ఆ కాన్సెప్టే చాలా విచిత్రంగా ,ఎవరికి అర్థం కాని విధంగా ఉంటుంది. ఒక సినిమాలోని పాత్రలు మరొక సినిమాలోకి సడన్ గా ప్రవేశించి హంగామా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఫాంటసీ ..సైన్స్ ఫిక్షన్ లాంటి కాన్సెప్ట్స్ దగ్గర నుంచి భారీ యాక్షన్ సీక్వెన్స్ వరకు ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ సాగుతుంది. పైగా ఇటువంటి కాన్సెప్ట్స్ వల్ల సినిమాని ఎలా కావాలంటే అలా మలుచుకునే ఆస్కారం డైరెక్టర్ కు ఉంటుంది.
అందుకే గత కొద్ది కాలంగా మల్టీవర్స్ కాన్సెప్ట్స్ మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.అందుకే ఈ ఫార్ములాను బాలీవుడ్ , టాలీవుడ్,కోలీవుడ్..ఇలా అందరూ వరుసగా తమ రేంజ్ లో ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్శ్ క్రియేట్ చేసింది. టైగర్..వార్.. పఠాన్.. ఈ మూడు చిత్రాల రా ఏజెంట్స్ ను కలిపి ఒక సరికొత్త స్పై వరల్డ్ సృష్టించింది. ఇక పై ఇదే రేంజ్ ప్రయోగాలు టాలీవుడ్ లో కూడా కనిపించే అవకాశం ఉంది. అందులోనూ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ నందమూరి నటసింహంతో లింక్ అవ్వబోతోంది.
బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి ఫిక్షన్ కంటెంట్ తో అలరించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచినవే. ఇందులో ఆదిత్య 369 ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన డ్రామా.. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. బాలకృష్ణ రోజా కాంబినేషన్లో వచ్చిన భైరవద్వీపం ఫిక్షనల్ అంశాలతో మంత్రాలు, తంత్రాలు ,శక్తులు ,వేరే లోకాలు ఇలా ఎంతో ఆసక్తిగా ఉంటుంది.
నెక్స్ట్ బాలయ్య ఆదిత్య 999 మాక్స్ మూవీ తో ప్రయోగానికి సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఫాంటసీ ఫిక్షన్ అంశాలతో పాటుగా ఎన్బీకే మల్టీవర్స్ నీకు కూడా ప్రయోగించే విధంగా ఆలోచిస్తున్నారు అని సమాచారం. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ పౌరాణిక ,ఫాంటసీ స్కోప్ ఉన్న మూవీతో పాలయను మీట్ అయినట్లు. ప్రశాంత్ చెప్పిన స్టోరీ లైన్ బాలయ్యకు కూడా ఆసక్తి కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె సీజన్ 2 ప్రోమో కోసం ప్రశాంత్ వర్మ బాలయ్యతో కలిసి పనిచేశాడు. ఇందులో బాలయ్యను పాత వెస్ట్రన్ టౌన్ బుక్ లో అద్భుతంగా చూపించాడు. ఇక ఈ కలయికలు ఆదిత్య 369, భైరవద్వీపం టైప్ ఛరిష్మాతో బాలయ్య కనిపించే అవకాశం ఉంది అని అభిమానులు ఆశిస్తున్నారు.