ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల ప్రీమియర్ లీగ్ సేల్‌ను ప్రకటించింది.

ఈ సేల్‌లో కేవలం రూ.10000ల లోపు బెస్ట్ 5జీ ఫోన్‌లను కొనుక్కోవచ్చు.

అందులో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

దీని అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 25 శాతం తగ్గింపుతో రూ.10,499కి లిస్ట్ అయింది.

ఇప్పుడు రూ.1000 కూపన్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ 5జీ ఫోన్‌ను రూ.9,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్‌పై క్రేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

దీని అసలు ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు 41 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.9,499లకే లిస్ట్ అయింది.

ఇప్పుడు దీనిపై రూ.500 వరకు కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఇది రూ.8,999లకే లభిస్తుంది.

అలాగే రెడ్ మి 12 5జీ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్‌తో రూ.11,999లకే లిస్ట్ అయింది.

దీనిపై ఏకంగా రూ.1250 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో దీన్ని రూ.10,749లకే కొనుక్కోవచ్చు.