తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇక్కడ రూ.8 వేలలోపు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Redmi 13C ఫోన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.8,499గా ఉంది.
ఇది 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఫోన్ మొత్తం ర్యామ్ 12 జీబీకి చేరుకుంటుంది.
6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు.
దీంతోపాటు Poco C65 ఫోన్ కూడా ఉంది. ఇది 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది. వర్చువల్‌గా 6జీబీ వరకు పెంచుకోవచ్చు. మొత్తం ర్యామ్ 12 జీబీ అవుతుంది.
ఈ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్‌లో మీడియాటెక్ జీ85 ప్రాసెసర్ ఉంటుంది.
ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ.7,499 ధరతో కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు.
ఈ రెండు మొబైళ్లతో పాటు itel A70 స్మార్ట్‌ఫోన్ కూడా రూ.8 వేలలోపు లభిస్తుంది. ఇది 12 జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ రూ.6,799కి కొనుక్కోవచ్చు.
ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ చూడొచ్చు. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000ఎమ్ఏహెచ్.