ట్రెడీషినల్, మోడర్న్.. ఈ రెండూ కొందరు హీరోయిన్స్‌కే సెట్ అవుతాయి. అందులో ఐశ్వర్య రాజేశ్ ఒకరు.
1990 జనవరి 10న చెన్నైలో ఉండే ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది ఐశ్వర్య రాజేశ్.
ఐశ్వర్య తండ్రి రాజేశ్ ఒక తమిళ నటుడు, తన మేనత్త శ్రీ లక్ష్మి తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్.
సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబంలో జన్మించడంతో ఐశ్వర్య రాజేశ్క కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగింది.
ఐశ్వర్య రాజేశ్‌కు వెంటనే హీరోయిన్ అవకాశాలు రాలేదు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించింది.
‘కౌసల్య కృష్ణమూర్తి’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఐశ్వర్య రాజేశ్.
ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినా ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో మంచి గుర్తింపు దక్కించుకుంది.
త్వరలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.
ఐశ్వర్య సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే తను మోడర్న్, ట్రెడీషినల్ రెండూ బాగా బ్యాలెన్స్ చేస్తుందని తెలుస్తుంది.
ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్‌కు తమిళ, తెలుగులో చాలానే ఫ్యాన్స్ ఉన్నారు.