సపోటా తింటే.. శరీరానికి బోలెడు లాభాలు

సపోటా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీనిలో అనేక పోషకాలు నిండి ఉంటాయి.

సపోటా తింటే తియ్యగా ఉంటుంది. కానీ దీనిలోని విటమిన్స్ అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

ఇది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. పుష్కలమైన శక్తిని అందిస్తుంది.

సపోటాలోని విటమిన్ ఎ కంటికి మేలు చేస్తుంది.

ఇందులో ఉండే విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.

దీనిలో ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా ఉన్నాయి.

సపోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సపోటా పండ్లను నేరుగా తినవచ్చు లేదా రసం, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు.