మెంతి కూర తింటున్నారా.. అయితే ఈ ప్రయోజనాలు మీ సొంతం
మెంతికూర డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.
మెంతికూర నరాలకు బలాన్ని ఇస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో చక్కగా పనిచేస్తుంది.
మెంతి ఆకుల్లో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
ఆకలిని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మెంతికూర గాయాలు త్వరగా మానేలా చేయడంలో సహాయపడుతుంది.
శ్వాస సమస్యలతో పాటు.. గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా నివారిస్తుంది.
ఇంకా ఇవి కాలేయాన్ని రక్షించడంతో పాటు.. కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.