మఖానాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
మఖానాని వేయించిన తామర గింజలతో తయారు చేస్తారు. చూడటానికి తెల్లగా చిన్న బంతిలాగా, పాప్ కార్న్‌లా ఉంటాయి.
మఖానాలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
రుచికి క్రంచీగా న్యూట్రల్ ప్లేవర్‌తో టేస్టీగీ ఉంటాయి. వీటిని వంటల్లో ఉపయోగిస్తారు. తామర గింజలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మఖానాలో యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీర్ఘకాలిక వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తాయి.
ప్రతిరోజు మఖానా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
బరువు తగ్గాలనుకునేవారు రోజు డైట్‌లో మఖానా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఫైబరీ, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
మఖానాలో యాంటీ ఆక్సీడెంట్లు, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ముఖంపై ముడతలు తగ్గిపోయి యవ్వనంగా కనిపిస్తారు.
ఆర్ధరైటిస్‌తో బాధపడే వాళ్లు మఖానా తింటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.