ఫ్యాషన్ ఫ్రూట్ గురించి తెలుసా..? కృష్ణ ఫలం తింటే ఎన్నిలాభాలో
ప్యాషన్ ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియదు.. దీనిని కృష్ణఫలం అని కూడా అంటారు.
ఈ పండు ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో దొరుకుతుంది. దీనిపైన తొక్క గట్టిగా, లోపల గుజ్జు విత్తనాలతో మెత్తగా ఉంటుంది.
ఈ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యాషన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
ఈ పండులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ప్యాషన్ ఫ్రూట్‌లో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్యాషన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ప్యాషన్ ఫ్రూట్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సమస్యల నుండి కాపాడతాయి.
పాషన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.