డ్రగ్స్ తీసుకునే జంతువులు ఇవే

కారిబియన్ దీవుల్లో వెర్వెట్ కోతులు టూరిస్ట్ రిసార్ట్స్‌లో దూరి మద్యం సేవిస్తూ ఉంటాయి.

ఆస్ట్రేలియాలోని తస్మానియాలో వాల్లబీ కంగారూలు గంజాయి, గసగసాల ఆకులు చాలా ఇష్టంగా తింటాయి.

యూరోప్‌లోని స్కాండినేవియా దేశాల్లో రెయిన్‌డీర్ జింకలు మత్తు కలిగించే అగారిక్ టోడ్‌స్టూల్స్ మొక్కలను తింటాయి.

ఆస్ట్రేలియాలోని లోరికీట్స్ చిలుకలు ఫర్మెంటెడ్ నెక్టార్ తాగడంతో మత్తు వల్ల ఎగురలేకపోతాయి.

ఏనుగులు మరులూ చెట్టు ఆకులు తిని ఉద్రేకంగా వ్యవహరిస్తాయని తేలింది.

సముద్రంలో విషపూరితమైన పఫర్ ఫిష్ తినిడంతో డాల్ఫిన్ చేపలు మత్తులో జారిపోతాయి.