ఈ రోజుల్లో ఎవరు ఎక్కడికి వెళ్లినా.. ఫోన్ వెంట తీసుకెళ్లడం అలవాటైంపోయింది.

చాలా మంది టాయిలెట్‌లోకి వెళ్లేటప్పుడు కూడా మొబైల్‌ని వెంట తీసుకువెళ్తారు.

అయితే వాష్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు ఫోన్ వెంట తీసుకెళ్లవద్దని నిపుణులు చెబుతున్నారు.

టాయిలెట్‌లో ఫోన్ వాడడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి.

మొబైల్‌ను వాష్‌రూమ్‌లో ఉంచడం వల్ల త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది.

ఫోన్ స్క్రీన్‌పై సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా, వైరస్ పెరుగుతుంది.

ఆ ఫోన్ మీరు పట్టుకున్నప్పుడు మీ చేతులపై బ్యాక్టీరియా చేరుతుంది.

ఆ చేతులతో ఆహారం తీసుకుంటే రకరకాల వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బాత్‌రూంలోనైనా ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు.