ఎప్పుడూ వాకింగ్ ముందుకే కాదు, వెనక్కి కూడా నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
వెనుకవైపుగా నడవడాన్ని రెట్రో వాకింగ్ అని పిలుస్తారు.
ప్రతిరోజూ వెనక్కి ఐదు నిమిషాల పాటు నడిస్తే.. మెదడు ఆరోగ్యంతో పాటు గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
వెనకకు నడవడం వల్ల శరీరానికి, మెదడుకు మధ్య సమతుల్యత, సమన్వయం కుదురుతుంది.
కండరాల పైనా, నాడీ మార్గాల పైనా దృష్టి పెడతారు. దీనివల్ల మెదడు సమన్వయ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.
వెనక్కి నడవడం అనేది కాస్త కష్టమైన వ్యాయామం. కానీ ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది.
కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, గాయాలనుంచి కోలుకుంటున్న వ్యక్తులకు ఇలా వెనక్కి నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
వెనుకకు నడవడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పదునెక్కుతుంది. అభిజ్ఞా పనితీరు చక్కగా పనిచేస్తుంది.
అలాగే ఇలా వెనక్కి నడవడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్లు ఆనంద హార్మోన్ల జాబితాలోకి వస్తాయి.
వెనక్కి నడిచే వ్యాయామం చేయడానికి పార్కులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీ గదిలోనే చేయొచ్చు.