ఇండియాలోని అందమైన సన్‌సెట్ పాయింట్స్ ఇవే..
కన్యాకుమారిలో అరేబియన్ సముద్రం, ఇండియన్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్ కలయికలో సూర్యాస్తమయం సూపర్ గా ఉంటుంది.
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సాల్ట్ డెజర్ట్ ప్రాంతంలో అయితే సన్ సెట్ సమయంలో ప్రకృతి దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.
కర్ణాటకలోని అగుంబె ప్రాంతంలో పశ్చిమ వింధ్య పర్వతాల మీదుగా చూస్తే అస్తమిస్తున్న సూర్యుడు అందంగా కనిపిస్తాడు.
అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో వైట్ సాండ్ మీద నుంచి సూర్యాస్తమయం అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది.
కేరళలోని అలెప్పె బీచ్ ప్రాంతంలో కూడా మంచి సన్ సెట్ పాయింట్ ఉంది.
రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వతం నుంచి కూడా సూర్యుడు అస్తమించే మనోహర దృశ్యం చూడవచ్చు.