కొబ్బరినూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి మొటిమలను నివారిస్తాయి.

లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతాయి

శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిల్ని పెంచుతాయి.

చర్మంపై ఏర్పడే మంటను తగ్గిస్తాయి.

ప్రతిరోజూ కొబ్బరినూనెను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

జుట్టుకు తరచూ కొబ్బరినూనెను వాడటం వల్ల పెరుగుదల బాగుంటుంది.

జుట్టు చివర్లు చిట్లిపోయి ఉంటే.. కొబ్బరినూనె పట్టించి గోరువెచ్చని నీటితో వాష్ చేస్తే సమస్య తగ్గుతుంది.

లావెండర్ ఆయిల్ ను కొబ్బరినూనెతో కలిపి మసాజ్ చేస్తే.. చేతులు, కాళ్లలో నొప్పి తగ్గుతుంది.

పడుకునేముందు పెదవులపై కొబ్బరినూనెను రాస్తే.. పగుళ్లు తగ్గుతాయి.

చర్మంపై నల్లమచ్చలను తగ్గిస్తుంది. హైడ్రేట్ చేస్తుంది.

రాత్రివేళ ముఖానికి, మెడపై కొబ్బరినూనెతో మసాజ్ చేసి.. టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి.

ఇలా చేస్తే.. ఉదయానికి ముఖం తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది.