చాలా మందికి పొద్దున్న లేవగానే టీ, కాఫీ ఉండాల్సిందే.

అయితే కాఫీ తాగడానికి ఓ టైమ్ ఉంటుందని మీకు తెలుసా..?

రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే ఎక్కువ సార్లు కాఫీ తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు.

కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ మనలోని ఏకాగ్రతను, మొదడు పనితీరును పెంచుతుంది.

చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా కాఫీలు తాగుతూనే ఉంటారు.

ఉదయం నిద్రలేచి గ్లాసు వాటర్ తాగిన 2 గంటల తర్వాత కాఫీ తాగాలని నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీ తాగితే.. నిద్రలేమి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.