మారుతున్న జీవనశైలితో పాటు అనేక కారణాల వల్ల చాలా మంది తగినంత నిద్ర పోవడం లేదు.
కానీ త్వరగా నిద్ర పోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. రోజు 10 గంటలలోపే నిద్రపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ
ప్రతి రోజు తగినంత నిద్ర పోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.అంతే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
తగినంత నిద్ర అనేది గుండెకు చాలా మంచిది. మధుమేహం, అధిక రక్తపోటు రాకుండా ఉండేందకు నిద్ర చాలా అవసరం.
రాత్రి 10 గంటలలోపే నిద్ర పోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతంది. ఫలితంగా తక్కువగా అనారోగ్యం బారిన పడతారు.
నిద్ర పోయే ముందు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది. నిద్రపోయే ముందు ఫోన్ ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
మీ నిద్ర పూర్తయితే ఆ రోజు మీ మానసిక స్థితి బాగుంటుంది.అంతే కాకుండా సానుకూల ఆలోచనలు వస్తాయి.
ఇప్పటినుండైనా ప్రతి రోజు రాత్రి 10 గంటలలోపే నిద్రపోవడం అలవాటు చేసుకోండి