ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఇవే..
తల్లి అవడం అనేది దేవుడు ఇచ్చిన గొప్పవరం.. పెళ్లైన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.
అయితే గర్భందాల్చే క్రమంలో ఎంత జాగ్రత్త అయితే తీసుకుంటారో.. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.
మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి కలిగిన పండ్లు .. శిశువు పెరుగుదలకు తోడ్పడతాయి.
బీన్స్, పప్పులు, ఆకుకూరలు, వంటి ఇనుము కలిగిన ఆహారాలు తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ఎక్కువ రక్తాన్ని తయారు చేయడంలో సహాయపడతాయి.
కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఎముకలు, దంతాల అభివృద్ధికి సహాయపడతాయి.
హైడ్రేటెడ్ గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగడం వల్ల.. శిశువుకు రక్తం ద్వారా పోషకాలు అందుతాయి.
చాలా మంది ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు నాన్ వెజ్ తింటారు. కానీ గర్భధారణ సమయంలో అస్సలు తినకూడదంట.
డార్క్ చాక్లెట్స్, చిక్కీలు, పిల్లల మెదడును మెరుగుపరుస్తాయి. అలాగే తృణ ధాన్యాలు, అవిసెలు, చియాసీడ్స్ మంచిదట.