ఈ ఆహారాలతో మీ రోజును ఆరోగ్యంగా ప్రారంభించండి

రోజంతా ఎనర్జీగా ఉండాలన్నా, శరీర మెటబాలిజం పెరగాలన్నా న్యూట్రిషన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి

కోడిగుడ్లు.. వీటిలో ప్రొటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

గ్రీక్ యోగర్ట్.. ఇందులో ప్రొటీన్, క్యాల్షియం, ప్రో బయోటిక్స్  అధికంగా ఉంటాయి.  ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

అరటిపండ్లు.. వీటిలో పొటాషియం, స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి.

కాఫీ.. అధికంగా తాగితే అనారోగ్యమే. కానీ బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ఫ్లామేషన్ తో పోరాడుతాయి.

వెజిటబుల్ సలాడ్.. హెల్దీగా, డైట్ కంట్రోల్ లో ఉండేందుకు ఈ సలాడ్ బెస్ట్. రోజూ ఉదయాన్నే తినే బ్రేక్ ఫాస్ట్ తో కలిపి వీటిని కూడా తినొచ్చు.

పరగడుపునే పుల్లగా ఉండే పండ్లను తినకూడదు.  ఇవి అసిడిటీ సమస్యను పెంచుతాయి.