సాధారణంగా మనం ముఖం లేదా చేతులు, కాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాము. కానీ మెడ, మోచేతుపై ఉండే నలుపును తగ్గించడం పట్ల అంతంగా శ్రద్ద  చూపించము.

అందుకే మోచేతులు, మోకాళ్లపై ఉన్న నలుపు  స్పష్టంగా కనిపిస్తుంది. కానీ  ఇది మీ అందాన్ని తగ్గిస్తుంది.

ఇలా జరగకుండా మోచేతులు, మోకాళ్లపై నలుపును తగ్గించడానికి కొన్ని రకాల టిప్స్ పాటించడం అవసరం. ఆ టిప్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ, తేనె ఉపయోగించండి: ఒక బౌల్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ నిమ్మ రసం, 1 టీ స్పూన్ తేనె కలపి మిక్స్ చేయండి.

ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని మీ మెడ, మోచేతులపై రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు చేస్తే మెడ, మోచేతులపై ఉన్న నలుపు తగ్గుతుంది.

2. శనగపిండి పిండి, పసుపు పేస్ట్: 1 టేబుల్ స్పూన్  శనగ పిండి, 1 టీ స్పూన్ పసుపు పేస్ట్‌ను మెడ, మోచేతులపై అప్లై చేయండి.

తర్వాత 10 నిమిషాలు ఉంచి కడిగేయండి. ఇది నలుపుదనాన్ని తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుంది.

పసుపులో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంతో పాటు  చర్మం నల్లబడడాన్ని తగ్గిస్తుంది.