పిల్లలను బాధ్యతగా ఉంచే మంచి అలవాట్లు ఇవే..

చిన్నప్పటి నుంచే పిల్లలకు బాధ్యతలను అలవాటు చేయాలి

పిల్లలు బాధ్యతగా ఉండటం  వారి పెంపకం, పెరిగే పరిసరాలపై  ఆధారపడి ఉంటుంది.

ఉదయం లేవగానే పాటించవలసిన కొన్ని అలవాట్లను అలవాటు చేయాలి. ఇవి వారి భవిష్యత్ పై ప్రభావం చూపుతాయి.

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రలేచేలా అలారంను అలవాటు చేయాలి. ఇది పిల్లలకు క్రమశిక్షణను నేర్పిస్తుంది.

నిద్రలేవగానే.. వారి బెడ్స్ ను నీట్ గా ఉంచుకునేలా టీచ్ చేయాలి. బెడ్ షీట్స్ ను మడతపెట్టడం, పిల్లోస్ ను కరెక్ట్ గా ఉంచడం వంటివి నేర్పించాలి.

ఆ తర్వాత బ్రష్ చేయడం, ముఖం కడుక్కోవడం, ఇతర అవసరాలను తీర్చుకోవడం, స్నానం చేయడం వంటివి సమయం ప్రకారం చేసేలా చూడాలి.

ఖాళీ కడుపుతోనే గోరువెచ్చని నీరు తాగడం రోజువారీ పనుల్లో భాగమయ్యేలా అలవాటు చేయాలి. 

ఇవన్నీ పూర్తయ్యాక తప్పనిసరిగా ధ్యానం లేదా ప్రార్థన చేయడం అలవాటు చేయాలి. ఇవి పిల్లలకు కృతజ్ఞతగా, సానుభూతిగా ఉండటాన్ని నేర్పిస్తాయి.

ఉదయం సమయంలోనే 20-30 నిమిషాలపాటు ఆటలకు సమయం కేటాయించాలి. ఇవి పిల్లల శారీరక ఎదుగులను పెంచుతాయి. రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి.

పిల్లలు.. తమకు కావలసిన పుస్తకాలు, పెన్సిల్స్, బుక్స్ వగైరా స్వయంగా తీసుకోవడం, స్కూల్ బ్యాగ్స్ ను నీట్ గా ఉంచుకోవడం నేర్పించాలి.