ముఖం ఎంత అందంగా ఉన్నా దానిపై నల్లటి వలయాలు, ముడతలు ఇబ్బందిగా అనిపిస్తాయి.

ముఖానికి కొన్ని రకాల ఆయిల్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరి ముఖానికి ఎలాంటి ఆయిల్స్ ప్రయోజనాలు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం నూనె విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.పొటాషియం, జింక్ , ప్రోటీన్ కూడా ఉంటాయి.

బాదం నూనె చర్మంపై నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆలివ్ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటివి ఉన్నాయి.

ఆలివ్ నూనెలో ఉండే పాలీఫెనాల్స్, వృద్ధాప్యానికి ప్రధాన కారణమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.